కీర్తిమంతులకు రామభక్తుల నివాళి

  • courtesy – Rama devotees in media*

అయోధ్య రామ జన్మభూమి ఆందోళన అని మాట పలికితే దాని వెనుక మరొక అవిస్మరణీయ దిగ్గజం…..స్వర్గీయ పుల్లారెడ్డి.

ఆ రోజుల్లో కోర్టులో కేసు వాదించడానికి రోజుకు భారీగా ఖర్చు వస్తున్నందున ఢిల్లీ VHP కార్యాలయంలో ఆర్థిక సంకటం ఏర్పడింది. అప్పటికప్పుడు కష్టంగా ఉన్న సమయం.అప్పటికి ఇరవైఐదు లక్షలు సమీకరించాలి.కోశాధికారిగా ఉన్న  Sweets  జి. పుల్లారెడ్డి  దగ్గరికి అశోక్ సింగల్  వచ్చారు.

హైదరాబాద్ లో పుల్లారెడ్డి ఇంట్లో కూర్చొని చర్చలు..

లోపలికి వెళ్లి వచ్చిన పుల్లారెడ్డి …  అశోక్ జీ చేతిలో  రెండు లక్షల రూపాయలు  పెట్టి…

సాయంత్రానికి మరో పది లక్షలు, ఆ తర్వాత మిగతావి సమకూర్చుదాము అన్నారు.

రామజన్మభూమి కేసు మనకు విజయం చేకూరే వరకు వాదించవలసిందే దాని కొరకు పోరాడవలసినదే… ఎక్కడికైనా… ఎంత దూరమైనా, ఎన్ని త్యాగాలకైనా వెరవకుండా ముందుకు వెళ్దాం…

కేసు విషయంలో అంతరాయం కలగకూడదు అంటూ భరోసా ఇవ్వడమే కాక.

ఎర్రమంజిల్లో ఉన్న తన ఇంటి ముందుకు తీసుకువచ్చి అశోక్ జి చేతులు పట్టుకొని …

నేను బతికుండగా.., కోశాధికారిగా ఉండగా కేసుకు సంబంధించిన ధనం తక్కువ కానివ్వను .

” అవసరమైతే ఈ ఇల్లు అమ్మి వేద్దాం …ఆమె లక్షల రూపాయల విలువచేసే నగలు అమ్మి వేద్దాం …., అంటూ భార్య నారాయణమ్మ గారితో సహా అశోక్ జీ చేతులు పట్టుకుని ప్రార్థించాడు”.

అశోక్ సింఘాల్ కన్నీటి పర్యంతమై… ఆనందాశ్రువులు కనుకొనుకులలో సుడులు తిరుగుతుండగా….,

నీవంటి కుమారులు జన్మించినందుననే భారతమాత శిరస్సు ఉన్నతంగా నిలిచి ఉంది.అపజయం అన్నదే లేదు…

ఎప్పుడు తలవంచ వలసిన అవసరం రాదు అంటూ…

భారతమాత ప్రియపుత్రుని ఆలింగనం చేసుకున్నారు .

ఆలింగనం చేసుకుని పుల్లా రెడ్డి గారి భుజాన్ని ఆనందపు అశ్రువులతో తడిపేసారు కీర్తిశేషులు అశోక్ సింగల్ జి.

ఇటువంటి ఎందరో త్యాగధనుల  కృషి…
బలిదానులైన వారి ఆత్మార్పణం …

తమ రక్తాన్ని చెమటగా మార్చిన అనేకమంది అవిజ్ఞాతులైన హిందూధర్మ రక్షకులైన వారి త్యాగ ఫలమే ..రామజన్మభూమి ఆందోళన, దాని విజయం, నేటి అపూర్వ ఆవిష్కరణ. వాళ్లందరికీ   రామ భక్తులు నివాళి అర్పించారు.

print

Post Comment

You May Have Missed