×

కిన్నెరసాని ప్రాజెక్టు ద్వారా వచ్చే ఖరీఫ్ లో పది వేల ఎకరాల కు నీరు.

కిన్నెరసాని ప్రాజెక్టు ద్వారా వచ్చే ఖరీఫ్ లో పది వేల ఎకరాల కు నీరు.

మిషన్ కాకతీయపై మంత్రి హరీష్ రావు జిల్లాల వారీగా వీడియో కాన్ఫరెన్స్.

కిన్నెరసాని ప్రాజెక్చు కింద వచ్చె ఖరీఫ్ కు పది వేల ఎకరాలకు సాగు నీరు ఇవ్వాలని భారీ నీటి పారుదల శాఖ మంత్రి హరీష్ రావు అధికారులను ఆదేశించారు. ఈ మేరకు గెజిట్ నోటిఫికేషన్ జారీ చేయాలని సూచించారు. ఇవాళ ఆయన సచివాలయంలో మిషన్ కాకతీయ పనుల పురోగతిని సమీక్షించారు. మిషన్ కాకతీయ పనులు పూర్తయిన వెంటనే వాటిని ఆన్ లైన్లో పొందుపరచాలన్నారు. పనులు పూర్తయిన వెంటనే ఆ బిల్లుల వివరాలను ఆన్ లైన్లో అప్ లోడ్ చేయాలన్నారు.   కేంద్ర ప్రభుత్వ పథకమైన ఆర్.ఆర్.ఆర్ లో మంజూరయిన  చెరువుల పునరుద్దరణ పనులను మిషన్ కాకతీయలో చెపట్టవద్దన్నారు. ఇప్పటికే కొన్ని చెరువుల పనులు పూర్తయితే ఆ బిల్లులను ఆర్.ఆర్.ఆర్ పథకం కిందే పంపాలన్నారు. ఆర్.ఆర్.ఆర్ కింద మంజూరయిన చెరువుల పనులు పూర్తయి కాంట్రాక్టర్లు కు చెల్లింపులు చేసి ఉంటే వాటికి సంబంధించిన యుటిలైజ్ సర్టిఫికేట్ జారీ చేయాలని ఆర్థిక శాఖ అధికారులకు మంత్రి హరీష్ రావు సూచించారు.  ఆర్.ఆర్.ఆర్ లో చేపట్టాల్సిన చెరువుల పనులు ఇప్పటికే మిషన్ కాకతీయ కింద చేపడితే..ఆ వివరాలు తెలపాలన్నారు.

పనులు‌ మందగించే చోట్ల సీఈలు వెళ్లి పనులు వేగంగా జరిగేలా చూడాలన్నారు. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో ఈ నాలుగేళ్లలో మైనర్ ఇరిగేషన్ లో పెండింగ్ పనులు పూర్తి చేయడం ద్వారా లక్షా మూడు వేల ఎకరాలకు కొత్త ఆయకట్టుకు సాగు నీరు అందిస్తున్నట్లు చెప్పారు. కొత్త చెరువులను గుర్తించి వాటి పునరుద్ధరణ పనులకు నోటిఫికేషన్ జారీ చేయాలని అన్ని జిల్లాల మైనర్ ఇరిగేషన్ అధికారులను మంత్రి హరీష్ రావు ఆదేశించారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా లో తాలిపేరు ప్రాజెక్టు నవీకరణ పనులు వేగవంతం చేయాలన్నారు. కొడంగల్ మినీ ట్యాంక్ బండ్  పనులు త్వరితగతిన పూర్తి చేయాలని రంగారెడ్డి ఎస్.ఈని ఆదేశించారు. నిర్మల్ జిల్లా చిన్నసుద్దారం ప్రాజెక్ట్ కు సంబంధించి పునరావాస సమస్యలను వెంటనే పరిష్కారించాలన్నారు. సిద్దిపేట జిల్లా సింగరాయ ప్రాజెక్ట్ కు టెండర్లు పిలవాలన్నారు. శనిగరం ప్రాజెక్టు పనులు వేగవంతం చేయాలని మంత్రి ఆదేశించారు.

ఇక నుంచి మిషన్ కాకతీయ కింద చేపట్టే పనుల్లో కోటి రూపాయల వరకు ఎస్సీలకు 15 శాతం , ఎస్టీలకు 6 శాతం దక్కెలా రిజర్వేషన్ అమలు చేయాలన్నారు. దీనికి సంబంధించి ఇటీవలే జీవో కూడా ప్రభుత్వం జారీ చేసిందని…ఆ జీవో ప్రకారం పనుల్లో రిజర్వేషన్లు అమలు చేయాలన్నారు. న్యాక్ ద్వారా శిక్షణ పొందుతున్న ఎస్సీ, ఎస్టీలను ప్రోత్సాహించాలన్నారు. మిషన్ కాకతీయ పనుల్లో ముదంజలో ఉన్న ఖమ్మం జిల్లా మైనర్ ఇరిగేషన్ అధికారులను మంత్రి హరీష్ రావు అభినందించారు.

ఈ సమావేశం లో ఈఎన్.సీ మురళీధర్, ఓఎస్టీ శ్రీధర్ దేశ్ పాండే, సీఈలు, 31 జిల్లాల ఎస్.ఈలు,ఈఈలు, నోడల్ అధికారులు పాల్గొన్నారు.

print

Post Comment

You May Have Missed