×

కార్తీక మాసోత్సవానికి శ్రీశైల దేవస్థానం స్వాగతం

కార్తీక మాసోత్సవానికి శ్రీశైల దేవస్థానం స్వాగతం

సకల ఏర్పాట్లతో  శ్రీశైల దేవస్థానం కార్తీక మాసోత్సవానికి  స్వాగతం పలికింది. దేవస్థానం ఈ ఓ కే ఎస్ రామారావు  ఆధ్వర్యంలో దేవస్థానం అధికారగణం , సిబ్బంది చక్కని ఏర్పాట్లు చేస్తూ ఈ ఉత్సవాలను విజయవంతం చేయడానికి సిద్ధంగా ఉందని దేవస్థానం ఎడిటర్ డా.అనిల్ కుమార్ తెలిపారు. సుమారు 20 లక్షల మంది భక్తులు దేవస్థానం సందర్శిస్తారని అంచనా. భక్తుల సౌకర్యం కోసం దేవస్థానం దర్శన వేళల్లో అవసరమైన కొన్ని మార్పులు చేసింది. వివిధ హోమాలకు ఏర్పాట్లు చేసారు. క్యూ లైన్ల లో వేచిఉండే భక్తులకు అల్పాహారం, బిస్కెట్లు,మంచినీటి సౌకర్యం అందిస్తారు. ప్రతిరోజు ఆకాశ దీపాన్ని వెలిగిస్తారు. భక్తులు కార్తీక దీపారాధన చేసుకోడానికి వీలుగా నాగులకట్ట వద్ద, గంగాధర మండపం వద్ద ప్రత్యేక ఏర్పాట్లు చేసారు . లక్ష దీపోత్సవం , పుష్కర హారతి కి చక్కని ఏర్పాట్లు ఉంటాయి. కార్తీక పౌర్ణమి రోజు నవంబరు 12 వ తేది సాయంత్రం 6.౩౦ కు జ్వాలా తోరణం కార్యక్రమం ఉంటుంది. ప్రతిరోజు కార్తీక వనభోజనాలు ఉంటాయి. ధార్మిక , సాంస్కృతిక కార్యక్రమాలు ప్రత్యేకంగా ఉంటాయి.

print

Post Comment

You May Have Missed