శ్రీశైలంలో కార్తీకమాస ఉత్సవాల్లో భాగంగా నవంబర్ ఒకటోతేదీన కళానీరాజనం కార్యక్రమం జరిగింది. కాపవరపు సుబ్బా రావు మృదంగ విన్యాసం చేశారు. శివ తాండవంలోని వివిధ ప్రక్రియలను వారు మృదంగ విన్యాసం చేశారు. ఈ అద్భుత కార్యక్రమంలో వాయిలీన్ సహకారం పాణ్యం దక్షిణామూర్తి అందించారు. మృదంగ సహకారం కాపవరపు సుబ్రహ్మణ్యం అందించారు. కాగా బుధవారం కడప జిల్లా గాలివీడు మండలం భక్త బృందం స్వామి అమ్మవార్ల దివ్యదర్శనం లో పాల్గొన్నారు. ఆలయం అధికారులు ఘనంగా ఏర్పాట్లు చేశారు.