కాణిపాకం శ్రీవరసిద్ధి వినాయక స్వామికి శ్రీశైలం దేవస్థానం తరఫున పట్టువస్త్రాలు
కాణిపాకం శ్రీవరసిద్ధి వినాయక స్వామికి శ్రీశైలం దేవస్థానం తరఫున సోమవారం పట్టువస్త్రాలు సమర్పించారు. కాణిపాక బ్రహ్మోత్సవాలు సెప్టెంబర్ 13 న ప్రారంభమై ఈనెల 3 న ముగియనున్న సందర్బంగా శ్రీశైలం దేవస్థానం వారు పట్టువస్త్రాలు సమర్పించారు.శ్రీశైల దేవస్థానం ఈ ఓ ఎ.శ్రీరామచంద్రమూర్తి , సహాయ కార్యనిర్వహణాధికారి ఎస్.వి.కృష్ణారెడ్డి ,అర్చకస్వాములు ,వేద పండితులు తదితరులు కాణిపాకం చేరుకొని ఈ వస్త్రాలు సమర్పించారు .కాణిపాకం దేవస్థానం ఈ ఓ పీ పూర్ణచంద్ర రావు ఇతర అధికారులు , అర్చకస్వాములు వీరికి సాదరంగా స్వాగతం పలికారు . స్వామివారికి పట్టువస్త్రాలు సమర్పించిన అనంతరం పూజలు జరిపారు. ఈ రోజు అనేకమంది భక్తులు శ్రీశైలం సందర్శించారు.సామూహిక అభిషేకాలు , సహస్ర దీపార్చన సేవ,వెండి రథోత్సవ సేవ ఘనంగా జరిగాయి.కళారాధన కార్యక్రమం లో శ్రీశైలం టి .లేక్షణారెడ్డి కూచిపూడి నృత్య ప్రదర్శన జరిగింది.అలంకార మండపంలో శ్రీ సామవేదం షణ్ముఖ శర్మ అయిదో రోజు ప్రవచనం జరిగింది. దేవస్థానం అధికారులు సాదరంగా ఆహ్వానించారు.
Post Comment