కవిత కు కృతజ్ఞతాభివందనాలు
నిజామాబాద్ ఎంపీ కల్వకుంట్ల కవిత కు కృతజ్ఞతాభివందనాలు వెల్లువెత్తాయి. వివిధ ప్రభుత్వ శాఖలకు చెందిన ఉద్యోగులు, కార్మికులు బుధవారం హైదరాబాద్ లోని ఎంపి కవిత నివాసంలో కలిసి కృతజ్ఞతలు తెలిపారు.
తెలంగాణ ఎంపీడీఓ ల సంఘం నేతలు:
టిఆర్ఎస్ అనుబంధ కార్మిక సంఘం టి ఆర్ ఎస్ కే వి ఆధ్వర్యంలో తెలంగాణ బొగ్గు గని కార్మిక సంఘం(TBGKS), తెలంగాణ రాష్ట్ర విద్యుత్ కార్మిక సంఘం నేతలు(TRKVS), సెకండ్ ఎంఎన్ఎంలు, ఆశా వర్కర్లు, జిహెచ్ఎంసి కమ్యూనిటీ ఆర్గనైజర్లు పెద్ద ఎత్తున తరలివచ్చి కృతజ్ఞతలు తెలిపారు.ముఖ్యమంత్రి కేసీఆర్ సింగరేణి ఉద్యోగుల సమస్యలను పరిష్కరిస్తున్న నేపథ్యంలో టిబిజికే ఎస్ అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు వెంకట్రావు, రాజిరెడ్డి, సమన్వయకర్త గోపాల్ రావు లు ఎంపి కవిత కు కృతజ్ఞతలు తెలిపారు.
తెలంగాణ ఎంపిడిఓ ల సంఘం నేతలు నిజామాబాద్ ఎంపి కల్వకుంట్ల కవిత ను కలిసి కృతజ్ఞతలు తెలిపారు. ఎంపిడిఓ ల ప్రమోషన్ల ఫైలు పై సీఎం కేసిఆర్ సోమవారం సంతకం చేసిన విషయం తెలిసిందే. ఎంపి కవిత ను కలిసిన వారిలో ఎంపిడిఓ ల సంఘం అధ్యక్షులు రాఘవేందర్ రావు, నాయకులు శ్రీనివాస రావు, శ్రీధర్, శ్రవణ్ కుమార్, దిలీప్ కుమార్, శ్రీనాథ్ రావు, భగవాన్ రెడ్డిలు ఉన్నారు.
గ్రామ పంచాయతీల సంఘం అధ్యక్షులు నరసింహ, ప్రధాన కార్యదర్శి యజ్ఞ నారాయణ, అంగన్వాడీ వర్కర్ల సంఘం అధ్యక్షురాలు భారతి, ప్రధాన కార్యదర్శి రాణి, మినీ అంగన్వాడీ సంఘం అధ్యక్షురాలు వరలక్ష్మి, వీఆర్ఏ సంఘం నాయకులు రాజయ్య డైరెక్టర్ రిక్రూట్మెంట్ నాయకులు ఈశ్వర్, రమేష్, cpw నాయకులు రవి, వాటర్ వర్క్స్ డిపార్ట్మెంట్ లోని ఎం ఓ ఎమ్ కాంట్రాక్టు ఉద్యోగులు, 108 ఉద్యోగులు, బీడీ టీకే దారుల సంఘం నాయకులు ఎంపీ కవిత ని కలిసి తమ సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లాలని కోరారు.
ఈ కార్యక్రమంలో ఖమ్మం ఎంపి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, టిఆర్ఎస్ అనుబంధ కార్మిక విభాగం టీఆర్ఎస్ కేవి అధ్యక్షులు జి. రాంబాబు యాదవ్, ప్రధాన కార్యదర్శి నారాయణ, టిఆర్ఎస్ కార్యదర్శి రూప్ సింగ్ తదితరులు పాల్గొన్నారు.
ఎంపి కవితకు కృతజ్ఞతలు తెల్పిన టిఆర్ వి కెఎస్ నేతలు:
తెలంగాణ రాష్ట్ర విద్యుత్ కార్మిక సంఘం నేతలు నిజామాబాద్ ఎంపి, TRVKS గౌరవాధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత ను కలిసి కృతజ్ఞతలు తెలిపి, సన్మానించారు. ఈ సందర్భంగా కార్డ్ బోర్డ్ పై ఎంపి కవిత ఫోటో ను ముద్రించిన ఫోటో ఫ్రేమ్ ను ఎంపి కవితకు బహూకరించి తమ అభిమానాన్ని చాటుకున్నారు TRVKS నేతలు.ఈ నెల 1వ తేదీన విద్యుత్ ఉద్యోగులకు 35శాతం ఫిట్మెంట్, వేయిటీజ్, అలవెన్సులు ను
ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రకటించిన విషయం తెలిసిందే. ఇవాళ దీనికి సంబంధించి ట్రాన్స్ కో ఆర్ధర్ ను కూడా ఇప్పించినందుకు
ఎంపి కవిత కు టీఆర్ వి కె ఎస్ నేతలు కృతజ్ఞతలు తెలిపారు.ఈ సందర్భంగా ఎంపి కవిత మాట్లాడుతూ
అందరి ఇళ్లలో వెలుగులు చిమ్మే విద్యుత్ ఉద్యోగుల జీవితాల్లో వెలుగులు నింపిన ముఖ్యమంత్రి కేసిఆర్ కు TRVKS రుణపడి ఉంటుందన్నారు.
ఈ కార్యక్రమంలో ఖమ్మం ఎంపి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, TRVKS రాష్ట్ర అధ్యక్షులు కె.వి జాన్సన్, ప్రధాన కార్యదర్శి కె.ప్రకాష్,
మేడే రాజీవ్ సాగర్, దాస్యం విజయ భాస్కర్, సీనియర్ వర్కింగ్ ప్రెసిడెంట్ సిహెచ్.రమేష్, వర్కింగ్ ప్రెసిడెంట్ ఎస్. మునీందర్, డోలి శ్రీను, అదనపు ప్రధాన కార్యదర్శి దుర్గ అశోక్, కోశాధికారి మోహన్ రెడ్డి, ఎస్ పి డి సి ఎల్ డిస్కం అధ్యక్షులు బి.భాస్కర్, కరణ్ రావు, వి.రాములు, కె పి కృష్ణమోహన్, ఎస్.రామకృష్ణ, వి.సునీల్, ఎం. ఏ మోహన్ ఉన్నారు.
Post Comment