కళలకు, సాంస్కృతిక కార్యక్రమాలకు మంచి వేదిక ” కళావైభవం.కామ్ (సాంస్కృతిక సమాచార సమాహారం) ” అని తెలంగాణ ప్రభుత్వ భాషా సాంస్కృతిక శాఖ సంచాలకులు మామిడి హరికృష్ణ కొనియాడారు.శనివారం 30వ తేదీ సాయంత్రం రవీంద్రభారతిలోని పైడి జైరాజ్ ప్రివ్యూ థియేటర్ లో జరిగిన కార్యక్రమంలో మామిడి హరికృష్ణ కళావైభవం.కామ్ వెబ్సైటు పోస్టర్ ను ఆవిష్కరించి, మంచి పేరు కళావైభవం.కామ్ అని నిర్వాహకుడు కె.ఎల్. నరసింహా రావు ను అభినందించారు.మామిడి హరికృష్ణ మాట్లాడుతూ ఈ వెబ్సైట్ కళలు , మన సంస్కృతి వైభవం దశ దిశలా వ్యాపించే విధంగా రూపుదిద్దుకుందని ఇది ఆనందదాయకం అని పేర్కొన్నారు. అన్ని కార్యక్రమాలను చక్కగా కవరేజ్ చేస్తాడని కె.ఎల్. నరసింహా రావు ను అభినందించారు . మన కళల సంపద రేపటి తరానికి అందాలన్న సంకల్పంతో మొదలు పెట్టిన ఈ కళావైభవం.కామ్ వైభవంగానే వెలుగొందాలని మామిడి హరికృష్ణ ఆకాంక్షించారు.
మామిడి హరికృష్ణ కళావైభవం.కామ్ వెబ్సైటు పోస్టర్ ను ఆవిష్కరించారు. కళావైభవం.కామ్ నిర్వాహకుడు కె.ఎల్. నరసింహా రావు మామిడి హరికృష్ణ కు కృతఙ్ఞతలు తెలిపారు.
ABOUT WWW.KALAVAIBHAVAM.COM
” కళావైభవం.కామ్ ” (సాంస్కృతికసమాచారసమాహారం)
శ్రీశ్రీశ్రీ త్రిదండి శ్రీమన్నారాయణ చిన్న జీయర్ స్వామివారి దివ్య మంగళాశాసనాలతో ” కళావైభవం.కామ్ ” ( kalavaibhavam.com ) వెబ్ సైట్ (సాంస్కృతిక సమాచార సమాహారం) జర్నలిస్ట్ కోవూరు లక్ష్మి నరసింహా రావు సారథ్యంలో మీ ముందున్నది.దేశంలోని ప్రముఖ దేవాలయాలు, యాత్రాస్థలాలు, తెలుగు పండుగలు, మన సనాతన సాంప్రదాయాలు, భారతీయ సంస్కృతులు, వాటి ప్రాముఖ్యతలతో కూడిన విశేషాలు హైదరాబాద్ వేదికగా ” కళావైభవం ” వెబ్ సైట్ నిండు పున్నమిలా వెలుగులతో వికసిస్తూ ఆదరాభిమానాలు అందుకుంటుందని ఆశిద్దాం. దశాబ్దకాలంగా పత్రికారంగంలో ముందుకుసాగుతూ, కళారంగ, ఆధ్యాత్మిక అభిరుచులతో ” కళావైభవం.కామ్ ” వెబ్ సైట్ ను ముందుకు తీసుకుపోతామని కోవూరు లక్ష్మీ నరసింహా రావు పేర్కొన్నారు .