కర్నూల్లో ట్రాఫిక్ నియంత్రణకు మరిన్ని చర్యలు అవసరమని అధికారులు భావిస్తున్నారు. జిల్లా పోలీసు కార్యాలయంలో శనివారం నగరంలోని పోలీసు అధికారులతో ట్రాఫిక్ క్రమబద్దీకరణపై జిల్లా ఎస్పీ గోపినాథ్ జెట్టి సమావేశం నిర్వహించారు. పట్టణ డిఎస్పీ ఖాదర్ బాషా , ట్రాఫిక్ డిఎస్పీ సి. ఎమ్ గంగయ్య తదితరులతో మాట్లాడి పలు ఆదేశాలు, సూచనలు జారీ చేశారు ఎస్పీ గోపినాథ్ జెట్టి , ఎమ్మెల్యె ఎస్వీ మోహన్ రెడ్డి, మున్సిపల్ కమిషనర్ హరినాథ్ రెడ్డి కలిసి జిల్లా పోలీసు కార్యాలయంలో మొక్కలు నాటారు. మార్కెట్ యార్డు, కొత్తపేట దగ్గర ఉన్న పాత క్వాటర్స్ లకు వెళ్ళి అక్కడ ఉన్న డ్రైనేజీ , వాటర్ ట్యాంకుల సమస్యలను పరిశీలించారు. క్వాటర్స్ ల చుట్టూ ప్రహరీ గోడ ఏర్పాటు చేసేందుకు సన్నాహాలు చేస్తామన్నారు. త్వరలో పోలీసు క్వాటర్స్ ల పరిసరాలలో స్వచ్చభారత్ నిర్వహిస్తామన్నారు. ముఖ్యమైన రద్దీ ప్రాంతాలైన రాజ్ విహార్, కిడ్స్ వరల్డ్ , ఎన్ టి ఆర్ సర్కిల్, ప్రభుత్వ ఆసుపత్రి, సి.క్యాంప్ , బళ్ళారి చౌరస్తా, కొత్త బస్టాండ్ తదితర సర్కిళ్ళలో ట్రాఫిక్ నియంత్రణ కు ఏ చర్యలు తీసుకోవాలో చర్చించామన్నారు. ఎమ్మెల్యే , మున్సిపల్ కమీషనర్ స్పందించి తగిన పనులను పూర్తి చేయిస్తామని తెలిపారు. రద్దీ ప్రాంతాలలో పార్కింగ్ స్ధలాలను ఏర్పాటు చేస్తామన్నారు. రోడ్డు వెడల్పు చేయించేలా చర్యలు తీసుకుంటామన్నారు. సమన్వయంతో కలిసి పని చేస్తామన్నారు. ఎఆర్ అడిషనల్ ఎస్పీ ఐ. వెంకటేష్, డిఎస్పీలు , సి. ఎమ్. గంగయ్య, బాషా, జె.బాబుప్రసాద్, సిఐలు డేగల ప్రభాకర్, నాగారాజా రావు, ఆర్ ఐ రంగముని , పోలీసు సంఘం అధ్యక్షులు దామోదర్ రెడ్డి, ఎస్సైలు ఉన్నారు.