
*మంచి ఆహారం..ఆహ్లాదం.. ఆనందం..ఆరోగ్యం..కేరాఫ్ కోవిడ్ ‘కేర్’ సెంటర్స్
*ఇంటిని మరిపిస్తున్న కర్నూలు జిల్లా కోవిడ్ కేర్ సెంటర్స్
*జిల్లా కలెక్టర్ జి.వీరపాండియన్ ఆధ్వర్యంలో అత్యుత్తమంగా కోవిడ్ కేర్ సెంటర్స్ నిర్వహణ
*కోవిడ్ కేర్ సెంటర్స్ లో నాణ్యమైన పౌష్టికాహారం :-
*బాధితులకు అందించే భోజనంలో రాజీ మాటే లేదు :-
*ఆదర్శంగా నిలుస్తున్న కర్నూలు, నంద్యాల, ఎమ్మిగనూరు, ఆదోని, సున్నిపెంట కోవిడ్ కేర్ సెంటర్ లు :-
ప్రభుత్వ నిధులతో ఒక్కో కరోనా పేషెంట్‌కు రోజూ రూ.350లకు ఏపీ టూరిజం హరిత హోటల్స్ ద్వారా నాణ్యమైన పౌష్టిక ఆహారం తో మూడు పూటలా అల్పాహారం.. భోజనం: నాణ్యతలో నో కాంప్రమైజ్ : జిల్లా కలెక్టర్ జి వీరపాండియన్ :-
సెకండ్ వేవ్ కోవిడ్ లో ఈ నెల 25 వరకు జిల్లాలో ఆదోని, కర్నూలు, నంద్యాల, ఎమ్మిగనూరు, సున్నిపెంట 5 కోవిడ్ కేర్ సెంటర్స్ లో 14, 165 మంది కోవిడ్ పేషేంట్స్ అడ్మిషన్స్…వారిలో 10915 మంది ఆరోగ్యంగా డిశ్చార్జ్..ప్రస్తుతం 2505 మంది చికిత్స పొందుతున్నారు
కోవిడ్ కేర్ సెంటర్స్ నిర్వహణపై జిల్లా యంత్రాంగాన్ని సోమవారం స్టేట్ గెస్ట్ హౌస్ లో నిర్వహించిన సమీక్షా సమావేశంలో అభినందించిన ఆర్థిక శాఖ మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్, ఎమ్మెల్యేలు, ప్రజా ప్రతినిధులు
కోవిడ్ కేర్ సెంటర్స్ లో మంచి ఆహారం..ఆహ్లాదకరమైన వాతావరణం…నాణ్యమైన భోజనం, మంచి వైద్య సదుపాయాలు, ప్రతి సాయంత్రం సాంస్కృతిక కార్యక్రమాలు..ఆటా .. పాటలతో ఆనందం.. ఆరోగ్యం : పేషేంట్స్
కర్నూలు, మే 25 :ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ఆదేశాలతో… జిల్లా కలెక్టర్ జి.వీరపాండియన్ నేతృత్వంలో కోవిడ్ కేర్ సెంటర్స్ ఇంఛార్జి జేసీ(సంక్షేమం) శ్రీనివాసులు, నోడల్ అధికారులు, వైద్య ఆరోగ్య సిబ్బంది, పోలీసులు, సంక్షేమ శాఖల అధికారులు, సిబ్బంది, మున్సిపల్ అధికారులు, సిబ్బంది, ఎస్.ఎస్.ఏ పి.ఓ. సిబ్బంది ఆధ్వర్యంలో జిల్లాలో నిర్వహిస్తున్న ఆదోని, కర్నూలు, నంద్యాల, ఎమ్మిగనూరు, సున్నిపెంట తదితర 5 కోవిడ్ ‘కేర్’ సెంటర్స్ ఇంటిని మరిపిస్తూ.. అత్యుత్తమ నిర్వహణపై అన్ని వర్గాల నుండి మంచి పేరు తెచ్చుకోవడంతో పాటు పేషేంట్స్, ప్రజా ప్రతినిధుల మన్ననలు పొందుతున్నాయి
కోవిడ్ కేర్ సెంటర్స్ లో ప్రతి కోవిడ్ బాధితులకు..ప్రతి రోజూ 350 రూపాయల రాష్ట్ర ప్రభుత్వ వ్యయంతో జిల్లా కలెక్టర్ వీరపాండియన్ ఆదేశాల మేరకు ఏపీ టూరిజం డివిజనల్ మేనేజర్ ఈశ్వరయ్య ఆధ్వర్యంలో మూడు పూటలా మంచి నాణ్యమైన పౌష్టికాహారాన్ని అందజేస్తున్నారు
కోవిడ్ పేషెంట్లు త్వరితగతిన కోలుకోవడానికి ఖర్చుకు వెనకాడట్లేదని, రోగనిరోధక శక్తి పెంచడానికి ఉపయోగ పడే పౌష్టిక ఆహారాన్ని అందిస్తున్నామని, కోవిడ్ పేషెంట్లకు పౌష్టికాహారాన్ని అందించడానికి జిల్లా కలెక్టర్ ఆదేశాల మేరకు పర్యాటక శాఖ అధికారులు ప్రత్యేకంగా ఫుడ్ సెంటర్‌ను నెలకొల్పి మంచి ఆహారాన్ని టైం ప్రకారం పేషేంట్స్ కు అందిస్తున్నామని జేసీ(సంక్షేమం) శ్రీనివాసులు తెలిపారు
కలెక్టర్ ఆదేశాల ప్రకారం కరోనా బాధితులు మానసిక ఒత్తిడికి గురికాకుండా.. అధిక పోషక విలువలు కలిగిన ఆహారంతో పాటు కర్నూలు, నంద్యాల, ఎమ్మిగనూరు, ఆదోని, సున్నిపెంట టిడ్కో కోవిడ్ కేర్ సెంటర్స్ లో ప్రతి రోజూ సాయంత్రం సాంస్కృతిక కార్యక్రమాలు, ఉదయం యోగా, మెడిటేషన్, శారీరక వ్యాయామాలు, స్పోర్ట్స్, కౌన్సెలింగ్ తో మానసిక ధైర్యాన్ని నింపుతున్నామని జేసీ(సంక్షేమం) శ్రీనివాసులు తెలిపారు
కరోనా లక్షణాలు కలిగి ఉండి హోమ్ ఐసోలేషన్‌లో ఉండేందుకు అవకాశం లేనివారిని వెంటనే కోవిడ్ కేర్ సెంటర్స్ కు తరలించి తమ సొంత మనుషుల మాదిరి కోవిడ్ కేర్ సెంటర్స్ నిర్వాహక నోడల్ అధికారులు, సిబ్బంది, వైద్య ఆరోగ్య శాఖ డాక్టర్లు, సిబ్బంది వైద్య సేవలు అందిస్తున్నారని, దీంతో కోవిడ్ కేసులు కొంచెం తగ్గుముఖం పడుతున్నాయని ఆయన అన్నారు
కోవిడ్ కేర్ సెంటర్లలో పేషేంట్స్ ఆరోగ్యాన్ని చూసేందుకు 24/7 కింద వైద్యులు, వైద్య సిబ్బంది చికిత్స అందించడం, రుచికరమైన భోజన సదుపాయంతో పాటు ఆట..పాట..లతో పేషేంట్స్ కోలుకొని ఆరోగ్యంగా తమ ఇళ్లకు వెళుతున్నామని పేషేంట్స్ తెలిపారు. జిల్లా కలెక్టర్ ఆధ్వర్యంలో టిడ్కో కోవిడ్ కేర్ సెంటర్స్ లో అన్ని సదుపాయాలు చాలా బాగున్నాయని, ఇంటి కంటే బాగున్నాయని, అందరూ బాగా చూసుకుంటున్నారని, ఎటువంటి సమస్యలు లేవని ఎమ్మెల్యేగా తాను కోవిడ్ కేర్ సెంటర్ ను తనిఖీ చేసిన సందర్భంగా పేషేంట్స్ తనతో తెలిపారని సోమవారం స్టేట్ గెస్ట్ హౌస్ లో ఆర్ధిక శాఖ మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్, ఇంఛార్జి కలెక్టర్ రామసుందర్ రెడ్డి, ఎస్పీ డా.కె.ఫక్కీరప్ప, నంద్యాల ఎంపీ, ఎమ్మెల్యేలు, నగర మేయర్ లతో కలిసి కోవిడ్ నోడల్ అధికారులతో నిర్వహించిన సమీక్షలో నంద్యాల ఎమ్మెల్యే శిల్పా రవిచంద్ర కిశోర్ రెడ్డి తెలుపుతూ..ఇటువంటి పాజిటివ్ వార్తలు ప్రజలకు తెలపాలని.. దీంతో కోవిడ్ పేషేంట్స్ లో మనో ధైర్యం పెరుగుతుందని అన్నారు
కొంతమంది కోవిడ్ పేషేంట్స్ తమ సంతోషాన్ని ..కోవిడ్ కేర్ సెంటర్స్ లో ప్రభుత్వం, జిల్లా యంత్రాంగం అందిస్తున్న సేవలను ప్రశంసిస్తూ తమ అనుభవాలను సోషల్ మీడియా/ట్విట్టర్/ఫేస్ బుక్ అకౌంట్స్ ద్వారా నెటిజెన్లకు/బయట ప్రపంచానికి తెలియజెబుతున్నారు
జిల్లాలో ఆదోని, కర్నూలు, నంద్యాల, ఎమ్మిగనూరు, సున్నిపెంట కోవిడ్ కేర్ సెంటర్స్ లో మొత్తం దాదాపు ఆరు వేల పడకల దాకా ఏర్పాటు చేయగా ఇప్పటి వరకు మొత్తం 14,165 పేషేంట్స్ ను అడ్మిట్ చేసుకుని, మెరుగైన చికిత్స అనంతరం 10915 మంది ఆరోగ్యంగా డిశ్చార్జ్ అయి ఇంటికి వెళ్లారని…ప్రస్తుతం ఆదోని టిడ్కో కోవిడ్ కేర్ సెంటర్ లో 376 మంది, కర్నూలు లో 1094 మంది, నంద్యాలలో 835 మంది, ఎమ్మిగనూరు లో 178 మంది, సున్నిపెంట కోవిడ్ కేర్ సెంటర్ లో 22 మంది చికిత్స పొందుతున్నారని కోవిడ్ కేర్ సెంటర్స్ నోడల్ అధికారి సాంఘీక సంక్షేమ శాఖ డిడి రమాదేవి మరియు పేషేంట్స్ డేటా నోడల్ అధికారి ఎస్.ఎస్.ఏ.పి.ఓ. వేణుగోపాల్ తెలిపారు
కోవిడ్ కేర్ సెంటర్స్ లో ఫుడ్ మెనూ అదుర్స్…అంటున్నారు పేషేంట్స్:
జిల్లా కలెక్టర్ నిర్దేశించిన మెనూ ప్రకారం ..సోమవారం నుంచి ఆదివారం వరకు అల్పాహారం ముందు బెల్లం, పాలు కలిపిన రాగిజావ అందిస్తామని, అల్పాహారంలో మూడు పూరి లేదా మూడు చపాతి ఆలుబఠాని కుర్మాతో అందిస్తామని, టీ లేదా కాఫీ ఇస్తామని ఏపీ టూరిజం అధికారి ఈశ్వరయ్య తెలిపారు
మధ్యాహ్నం భోజనం అన్నం 300 గ్రాములు, చికెన్ కర్రీ 100 గ్రాములు, వెజ్ కర్రీ 100 గ్రాములు, పప్పుకూర 75 గ్రాములతో పెడతామని తెలిపారు
ఆకుకూర కర్రీ 75 గ్రాములు, సాంబారు రైస్ 100 గ్రాములు, రసం 100 గ్రాములు, పెరుగు 100 గ్రాములు వీటితోపాటు ఒక పండు కూడా అందిస్తామన్నారు
సాయంత్రం 4.30 గంటలకు టీ, బిస్కెట్ ఇస్తామని, రాత్రి అన్నం 300 గ్రాములు, ఉడికిన గుడ్లు రెండు, చట్నీ లేదా వెజ్‌కర్రీ 100 గ్రాములు అందిస్తామని, అలాగే రోజూ పప్పుకూర, ఆకుకూర కర్రీ సాంబారు రైస్ , రసం , పెరుగు ఇస్తామన్నారు
వారం రోజులపాటు అందించే మెనూలో అల్పాహారం కింద అందించే వాటిలో మాత్రం అక్కడ ఉండేవారి అభిరుచి మేరకు స్వల్ప మార్పులు చేస్తూ ఉంటామన్నారు
మంగళవారం ఇడ్లీ రెండు, వడ, బుధవారం ఉప్మా 75 గ్రాములు, వడ రెండు, గురువారం ఉప్మా 75 గ్రాములు, ఊతప్పం, శుక్రవారం కిచిడి, చపాతి చేసి వాటికి ఆలుబఠాని కర్రీ కాంబినేషన్‌గా ఇస్తామన్నారు
శనివారం పులిహోర, దానికి కాంబినేషన్‌గా చట్నీ ఇస్తారు ఆదివారం టమాటా బాత్, పొంగలి ఇస్తామని అన్నారు
కోవిడ్ కేర్ సెంటర్స్ లో జిల్లా కలెక్టర్ ఆదేశాల మేరకు ఆహార సరఫరా..మెనూలో రాజీ పడేది లేదని జేసీ( సంక్షేమం) శ్రీనివాసులు తెలిపారు
కోవిడ్ కష్ట కాలంలో కోవిడ్ కేర్ సెంటర్స్ లో సాంస్కృతిక కార్యక్రమాలను నిర్వహించడానికి అవకాశం ఇచ్చి, ఉపాధి కల్పిస్తున్న ప్రభుత్వానికి, జిల్లా కలెక్టర్ వీరపాండియన్ కు రుణపడి ఉంటామని స్థానిక కళాకారులు అంటున్నారు