కరోన వైరస్ కట్టడికి అధికారులు నిత్యం అప్రమత్తంగా ఉండాలి-మంత్రి బుగ్గన

కర్నూలు, మే 24:కరోన వైరస్ కట్టడికి ప్రభుత్వం ప్రత్యేక చర్యలు తీసుకుంటోందని, జిల్లా అధికారులు నిత్యం అప్రమత్తంగా ఉండాలని రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ అధికారులకు ఆదేశించారు.

సోమవారం స్థానిక స్టేట్ గెస్ట్ హౌస్ మీటింగ్ హాల్ లో కోవిడ్ కట్టడి చర్యల పై జిల్లా ప్రజా ప్రతినిధులు, ఇంఛార్జి కలెక్టర్ రామసుందర్ రెడ్డి, ఎస్పీ డా.కె.ఫక్కీరప్ప, జాయింట్ కలెక్టర్లతో కలిసి కోవిడ్ నోడల్ కమిటీ అధికారులు, వైద్య ఆరోగ్య శాఖ అధికారులతో రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ సమీక్ష నిర్వహించారు.

సమీక్షా సమావేశంలో  నంద్యాల ఎంపీ పోచ బ్రహ్మానందరెడ్డి, కర్నూలు ఎమ్మెల్యే హఫీజ్ ఖాన్, పాణ్యం ఎమ్మెల్యే కాటసాని రాంభూపాల్ రెడ్డి, కోడుమూరు ఎమ్మెల్యే డాక్టర్ జె.సుధాకర్, నందికొట్కూరు ఎమ్మెల్యే తోగూరు ఆర్థర్, నంద్యాల ఎమ్మెల్యే శిల్పా రవి చంద్ర కిశోర్ రెడ్డి, నగర మేయర్ బి.వై.రామయ్య, జాయింట్ కలెక్టర్ (అభివృద్ధి) డాక్టర్ మనజీర్ జీలానీ సమూన్, జాయింట్ కలెక్టర్ (ఆసరా మరియు సంక్షేమం) శ్రీనివాసులు, నగర కమిషనర్ డి.కె బాలాజీ, ట్రైనీ అసిస్టెంట్ కలెక్టర్ నూరుల్ ఖమర్, డి.ఆర్.ఓ పుల్లయ్య, ఆర్డీఓ హరిప్రసాద్, డిఆర్డీఏ పిడి వెంకటేశ్వర్లు, జడ్పీ సీఈఓ వెంకట సుబ్బయ్య, జిజిహెచ్ సూపరింటెండెంట్ డాక్టర్ నరేంద్రనాథ్ రెడ్డి, కర్నూలు మెడికల్ కాలేజ్ ప్రిన్సిపల్ డాక్టర్ జిక్కి, ఇంచార్జి డిఎంహెచ్ఓ డా. మోక్షేశ్వరుడు, డా.వైఎస్సార్ ఆరోగ్య శ్రీ చీఫ్ మెడికో డాక్టర్ ఇలియాస్, కోవిడ్ 19 జిల్లా నోడల్ కమిటీ అధికారులు, ఆర్ అండ్ బి ఎస్ఈ జయరామి రెడ్డి తదితరులు పాల్గొన్నారు.

కర్నూలు జిల్లాలో 15,24,617 మందికి టెస్టింగ్ కాగ , అందులో 1,07,978 మందికి పాజిటివ్ నమోదు కాగా పాజిటివ్ రేట్ 7.08, డేత్స్ 679, ఫటాలిటీ రేట్ 0.63, డిచార్జెస్ 99,631, రికవరీ రేట్ 92.27, యాక్టివ్ కేసెస్ 7,668, యాక్టీవ్ రేట్ 7.10 ఉందని , జిల్లాలో కొవిడ్‌ నియంత్రణకు తీసుకుంటున్న ప్రత్యేక చర్యలపై ఇంఛార్జి కలెక్టర్ రామసుందర్ రెడ్డి మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్, ప్రజాప్రతినిధులకు వివరించారు.

ప్రభుత్వ సర్వజన ఆస్పత్రి లో ప్రకృతి నుంచి ఆక్సిజన్‌ తయారు చేసే (పీఎస్‌ఏ) ఆక్సిజన్‌ జనరేషన్‌ ప్లాంట్‌ కెపాసిటీ ఎంత అని ఆర్థిక శాఖ మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్…. ఏపీఎంఎస్ఐడిసి ఈఈ సదాశివ రెడ్డిని అడగగా నిమిషానికి వెయ్యి లీటర్ల ఆక్సిజన్ ఉత్పత్తి చేస్తుందని  వివరించారు. కోవిడ్ -19 వైద్య చికిత్సలో అత్యంత కీలకమైన సహాయకారి అయిన ఆక్సిజన్ లీకేజ్, దుర్వినియోగం కాకుండా ఉండేందుకు ఆక్సిజన్ రెగ్యులేటర్, పైప్లైన్, వాల్స్, ఆక్సిజన్ లీక్ కాకుండా ఉండేందుకు ప్రత్యేక చర్యలు చేపడుతూ, ఆక్సిజన్ వార్డులలో టెక్నీషియన్, నర్సులు విజిట్ చేస్తూ ఆక్సిజన్ వేస్ట్ కాకుండా పర్యవేక్షించి మానిటరింగ్ చేయాలన్నారు. ఒకవేళ రెగ్యులేటర్ సరిగ్గా లేకపోతే వెంటనే వాటిని మార్చాలన్నారు. జిల్లాలో కరోనా బాధితులకు నాణ్యమైన వైద్య సేవలు అందించడంలో భాగంగా జిజిహెచ్ లో డ్రగ్స్ సప్లై ఏమైనా ప్రాబ్లం ఉందా వంటి వివరాలను సూపర్డెంట్ నరేంద్రనాథ్ రెడ్డిని అడిగి తెలుసుకొని ఏవైనా అవసరం ఉంటే తనకు వెంటనే తెలియజేయాలన్నారు. మరింత బాధ్యత, సేవా దృక్పథంతో మనసెరిగి కోవిడ్ వార్డులలో సీనియర్ డాక్టర్లు, నర్సులు విజిట్ చేస్తూ పేషెంట్ల పట్ల కేర్ తీసుకొని, వీలైనంత ఎక్కువ సార్లు వార్డులోకి వెళ్లి వారి ఆరోగ్య స్థితి గతులపై పర్యవేక్షిస్తూ మనోధైర్యం కల్పించాలన్నారు. ఆక్సిజన్ అనవసరంగా వేస్ట్ కాకుండా పేషెంట్ కు ఎంత ఆక్సిజన్ అవసరం అంత మాత్రమే ఇవ్వాలని సూచించారు. జీజీహెచ్లో కోవిడ్ హాస్పిటల్ వార్డులలో సిసి టీవీ లన్ని ఇన్స్టాలేషన్ చేయాలని ఏపీఎంఎస్ఐడిసి ఈఈ సదాశివ రెడ్డికి ఆర్థిక శాఖ మంత్రి ఆదేశించారు. బెడ్ మీద ఆక్సిజన్ పొందుతున్న పేషెంట్ కేస్ షీట్ ను పరిశీలించి స్టాండర్డ్ ప్రోటోకాల్ పాటించి వైద్య సేవలు అందించాలన్నారు. ప్రభుత్వం నిర్ణయించిన ధర కన్నా ప్రైవేట్ హాస్పిటల్ వాళ్ళు ఎక్కువగా వసూలు చేస్తే వారిపై చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. ప్రతి కోవిడ్ ఆసుపత్రులలో ఎన్ని బెడ్స్ అవైలబుల్ గా ఉన్నాయి… తదితర వివరాలను బయట వైపు ప్రదర్శించేలా చర్యలు చేపట్టాలన్నారు. ఆరోగ్య శ్రీ హాస్పిటల్ లో కోవిడ్ పేషెంట్లకు 50 శాతం బెడ్స్ కేటాయించాలని, కేటాయించకపోతే సంబంధిత ఆరోగ్యశ్రీ హాస్పిటల్ పై చర్యలు తీసుకోవాలని ఆరోగ్యశ్రీ కోఆర్డినేటర్ డాక్టర్ సుమన్ కు రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రి ఆదేశించారు.

నంద్యాల ఎంపీ పోచా బ్రహ్మానంద రెడ్డి మాట్లాడుతూ ఆరోగ్య శ్రీ హాస్పిటల్ లో ఆరోగ్యశ్రీ బెడ్స్ సరిగా కేటాయించడం లేదని, అటువంటి ఆస్పత్రులపై తరచూ విజిట్ చేస్తూ ప్రత్యేక నిఘా ఉంచడంతో పాటు బాధ్యులైన వారిపై చర్యలు తీసుకోవాలని సూచించారు. గ్రామీణ ప్రాంతాలలో ఆర్ఎంపీలు లక్షణాలు ఉన్న వారికి వైద్య సేవలు అందిస్తూ పెయిన్ కిల్లర్స్ ఇస్తున్నారని అలా జరగకుండా చూడాలని అధికారుల దృష్టికి తీసుకొచ్చారు.

పాణ్యం ఎమ్మెల్యే కాటసాని రాంభూపాల్ రెడ్డి మాట్లాడుతూ పాణ్యం మండలంలో వ్యాక్సినేషన్ సెంటర్ ను ఏర్పాటు చేయాలని కోరారు. ప్రైవేట్ హాస్పిటల్ లో ఆరోగ్యశ్రీ బెడ్స్ ఎన్ని ఉన్నాయి.. ఆరోగ్యశ్రీ తరఫున జాయిన్ చేస్తున్నార లేదో ఒకసారి ఆఫీసర్లు వెళ్ళి తప్పక విజిట్ చేయాలన్నారు. ప్రైవేట్ ఆరోగ్యశ్రీ హాస్పిటల్ వెళ్లి ఏరోజైనా తనిఖీలు చేపట్టారో చెప్పండని ఆరోగ్యశ్రీ కోఆర్డినేటర్ కు ఎమ్మెల్యే కాటసాని రాంభూపాల్ రెడ్డి ప్రశ్నించారు.

కర్నూలు ఎమ్మెల్యే హఫీజ్ ఖాన్ మాట్లాడుతూ ప్రైవేట్ హాస్పిటల్ లో క్వాలిఫైడ్ వైద్యులు లేరని, ఆన్ క్వాలిఫైడ్ వైద్యులు కరోనా బాధితులకు స్టారాయిడ్ ఇస్తున్నారని, అటువంటి హాస్పిటల్ పై చర్యలు తీసుకోవాలని మంత్రిగారి దృష్టికి తీసుకు వచ్చారు.

కోడుమూరు ఎమ్మెల్యే డాక్టర్ జె.సుధాకర్ మాట్లాడుతూ గ్రామీణ ప్రాంతాలలో కరోనా టెస్టులను మరింత వేగవంతం చేయాలన్నారు. బ్లాక్ ఫంగస్ పై మరింత అవగాహన కల్పించి బాధితులకు మెరుగైన వైద్య సదుపాయాలు కల్పించాలన్నారు. కోవిడ్ హాస్పటల్లో కరోనా బాధితులకు డాక్టర్లు, నర్సులు విజిట్ చేస్తున్నారో లేదో సీసీ కెమెరాల ద్వారా మానిటరింగ్ చేయాలన్నారు.

నంద్యాల ఎమ్మెల్యే శిల్పా రవిచంద్ర కిషోర్ రెడ్డి మాట్లాడుతూ నంద్యాల కోవిడ్ కేర్ సెంటర్లో 4 ఆక్సిజన్ సిలిండర్ లు ఏర్పాటు చేయాలని కోరారు. కరోన బాధితులను ట్రాన్స్పోర్ట్ చేసి కోవిడ్ కేర్ కు తరలిస్తున్నామని, రికవరీ అయిన తర్వాత కోవిడ్ కేర్ నుంచి తమను పంపించేటప్పుడు ట్రాన్స్ పోర్ట్ చేస్తే బాగుంటుందని బాధితులు తమ దృష్టికి తీసుకువచ్చారన్నారు. నిన్నటి దినమున తాను నంద్యాలలోని కోవిడ్ కేర్ సెంటర్ ను ఆకస్మికంగా సందర్శించానని వెయ్యి మంది దాకా ఉన్నారు. సకాలంలో నాణ్యమైన భోజనం అందిస్తున్నారా, మందులు ఇస్తున్నారా, డాక్టర్లు విజిట్ చేస్తున్నారా, వసతులు బాగా ఉన్నాయా వంటి వివరాలను తాను అడగగా చాలా బాగా ఉన్నాయిని, సొంత మనుషుల బాగా చూసుకుంటున్నారని ఉదయం, సాయంత్రం సమయంలో యోగా చేయించడంతో పాటు సాయంత్రం సమయంలో సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహిస్తున్నారని కరోన బాధితులు సంతోషం వ్యక్తం చేశారని ఈ సందర్భంగా సమీక్షా సమావేశంలో తెలిపారు. ఇంత బాగా కోవిడ్ కేర్ సెంటర్ లో అన్ని వసతులు కల్పించిన అధికారులకు, సిబ్బందికి ఈ సందర్భంగా ఎమ్మెల్యే అభినందనలు కృతజ్ఞతలు తెలిపారు.

నందికొట్కూరు ఎమ్మెల్యే తోగూరు ఆర్థర్ మాట్లాడుతూ గ్రామీణ ప్రాంతాలలో టెస్టింగ్ ల సంఖ్యను మరింత పెంచి వాళ్లకు నాణ్యమైన వైద్య సేవలు అందించాలని సమీక్ష సమావేశంలో కోరారు.

అంతకముందు కోవిడ్ నోడల్ కమిటీ అధికారులతో కరోనా వైరస్ కట్టడికి తీసుకోవాల్సిన చర్యలు, అవసరాలు, ప్రభుత్వ సహకారం, తదితర వివరాలను సేకరించడం పై అధికారులతో ఆర్థిక శాఖ మంత్రి  బుగ్గన రాజేంద్రనాథ్ సుదీర్ఘంగా సమీక్షించారు.

print

By Online News Diary

ONLINENEWSDIARY.COM - A Multilingual Online News Portal

Leave a Reply

Your email address will not be published.