×

కరోన బాధిత 686 మంది జర్నలిస్టులకు ఆర్థిక సాయం

కరోన బాధిత 686 మంది జర్నలిస్టులకు ఆర్థిక సాయం

రాష్ట్రంలో ఇప్పటి వరకు  కరోన వైరస్ బారిన పడిన 686 మంది జర్నలిస్టులకు ఒక కోటి 28 లక్షల 60 వేల రూపాయల ఆర్థిక సహాయం అందించినట్లు తెలంగాణ రాష్ట్ర మీడియా అకాడమీ చైర్మన్ అల్లం నారాయణ తెలిపారు.

★ వీరిలో  పాజిటివ్ వచ్చిన 600 మంది జర్నలిస్టులకు ఇరవై వేల రూపాయల చొప్పున, ఒక కోటి 20 లక్షల రూపాయలు,  హోం క్వారంటైన్ లో ఉన్న 86 మంది జర్నలిస్టులకు పది వేల రూపాయల చొప్పున 8 లక్షల 60 వేల రూపాయలను అందించామని తెలిపారు. మొత్తంగా అందరికీ ఒక కోటి 28 లక్షల 60 వేల రూపాయల ఆర్థిక సహాయం అందించినట్లు తెలిపారు.

★ వివిధ జిల్లాలకు చెందిన జర్నలిస్టులకు కరోనా వైద్య పరీక్షలు నిర్వహించగా క్రొత్తగా మరో 73 మందికి పాజిటివ్ వచ్చిందని వైద్యాధికారులు నిర్థారించారు. ఈ 73 మంది జర్నలిస్టులకు 14 లక్షల 60 వేల రూపాయలు ఆర్థిక సహాయం జర్నలిస్టుల ఆన్లైన్ ఎకౌంట్లో జమ చేసినట్లు తెలిపారు.

★ జర్నలిస్ట్ మిత్రులు తమ వివరాలను తెలంగాణ రాష్ట్ర మీడియా అకాడమి చైర్మన్ వాట్సప్ (8096677444) నెంబర్ కి పంపాలని తెలిపారు.  మరిన్ని వివరాలకు  మీడియా అకాడమీ మేనేజర్ లక్ష్మణ్ కుమార్  సెల్ నెంబర్  9676647807 ని సంప్రదించవచ్చని ఆయన తెలిపారు.

★ కరోనా బారిన పడిన పాజిటివ్, క్వారంటైన్ జర్నలిస్టులు ప్రభుత్వ డాక్టర్లు ధృవీకరించిన మెడికల్ రిపోర్టులు మీడియా అకాడమీ కార్యాలయానికి తప్పనిసరిగా పంపించాలని సూచించారు.

print

Post Comment

You May Have Missed