కరోనా వైరస్ ను తుదముట్టించే దాకా ఇదే స్ఫూర్తితో ముందుకు
*రాష్ట్ర పరిస్థితులపై వినోద్ తో ఉప రాష్ట్రపతి ఆరా*
*సీఎం కేసీఆర్ చర్యలు బాగున్నాయన్న ఉప రాష్ట్రపతి*
*రాష్ట్ర ప్రభుత్వ, కరోనా నియంత్రణ కార్యక్రమాలను వివరించిన వినోద్ కుమార్*
హైదరాబాద్, ఏప్రిల్ 10 : రాష్ట్రంలో కరోనా వైరస్ ప్రబలిన తదనంతర పరిస్థితులపై భారత ఉప రాష్ట్రపతి ఎం. వెంకయ్యనాయుడు ఆరా తీశారు.
ఈ మేరకు శుక్రవారం రాష్ట్ర ప్రణాళికా సంఘం వైస్ చైర్మన్ బోయినపల్లి వినోద్ కుమార్ కు ఫోన్ చేసిన ఉప రాష్ట్రపతి రాష్ట్రంలోని రాష్ట్రంలోని తాజా పరిస్థితులను అడిగి తెలుసుకున్నారు.
వినోద్ కుమార్ మాట్లాడుతూ రాష్ట్రంలో ప్రభుత్వం తీసుకుంటున్న నియంత్రణ చర్యలను వివరించారు.
లాక్ డౌన్ నేపథ్యంలో రాష్ట్రంలో పేద ప్రజలు, వలస కార్మికులకు ప్రభుత్వపరంగా, దాతలను ప్రోత్సాహం ఇవ్వడం ద్వారా బియ్యం, నిత్యావసర వస్తువులు పంపిణీ చేస్తుండటం, అవసరమైన చోట భోజన వసతి కల్పిస్తున్న విషయాన్ని ఉప రాష్ట్రపతి వెంకయ్యనాయుడు దృష్టికి వినోద్ కుమార్ తీసుకొచ్చారు.
కరోనా వైరస్ మరింతగా ప్రబలకుండా ప్రభుత్వం కట్టుదిట్టమైన నియంత్రణ చర్యలు తీసుకుంటోందని వినోద్ కుమార్ ఉప రాష్ట్రపతి కి వివరించారు.
లాక్ డౌన్ ను కూడా పక్కాగా అమలు చేస్తున్న విషయాన్ని కూడా వినోద్ కుమార్ పేర్కొన్నారు.
రాష్ట్రంలో కరోనా వైరస్ నియంత్రణ చర్యలు బాగానే ఉన్న విషయం తన దృష్టికి వచ్చిందని ఉప రాష్ట్రపతి వెంకయ్యనాయుడు ఈ సందర్భంగా వినోద్ కుమార్ కు తెలిపారు.
రాష్ట్ర ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు కరోనా వైరస్ నియంత్రణ కోసం చేపడుతున్న చర్యలు బాగున్నాయని ఉప రాష్ట్రపతి వెంకయ్యనాయుడు పేర్కొన్నారు.
కరోనా వైరస్ ను తుదముట్టించే దాకా ఇదే స్ఫూర్తితో ముందుకు సాగాలని ఉప రాష్ట్రపతి సూచించారు.
Post Comment