దేవస్థాన సిబ్బంది, స్థానికులందరు కూడా స్వీయరక్షణకు అవసరమైన అన్ని జాగ్రత్తలు తీసుకోవాలని శ్రీశైల దేవస్థానం ఈ ఓ సూచించారు.కరోనాను అరికట్టేందుకు ముందు జాగ్రత్తలు తీసుకోవడంలో భాగంగా సిబ్బందికి విడతలవారిగా శిక్షణ అందజేయాలని దేవస్థానం సంకల్పించింది.ఈ శిక్షణ కార్యక్రమాలు ఈ రోజు ప్రారంభించారు . శివ దీక్షా శిబిరాల వద్ద ఫుడ్ కోర్టు లో ఈ శిక్షణా కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు.రాష్ట్ర దేవదాయశాఖ నుండి సంబంధిత ఆదేశాలు అందిన తరువాత ఆలయంలో భక్తులను దర్శనానికి అనుమతించవలసిఉంది .ఇప్పటికే కరోనాను అరికట్టేందుకు చేపట్టవలసిన ముందు జాగ్రత్త చర్యల గురించి దేవదాయ శాఖ ఎప్పటికప్పుడు పలు సూచనలు ఇస్తోంది. మొదటి విడతగా దేవస్థాన భద్రతా విభాగంలో ని 140 మంది భద్రతా సిబ్బందికి ఈ శిక్షణ ఇస్తున్నారు.ఈ కార్యక్రమాలలో స్థానిక ఐటిడిఏ విభాగపు డిప్యూటీ డిస్ట్రిక్ట్ మెడికల్ అండ్ హెల్త్ ఆఫీసర్ డా. ఎం. శ్రీనివాసరావు, స్థానిక ప్రాథమిక ఆరోగ్య కేంద్ర వైద్యాధికారి డా. ఎం. సోమశేఖరయ్య, దేవస్థాన వైద్యులు డా.శివప్రకాశ్ సిబ్బందికి కరోనాను అరికట్టడాన్ని గురించి అవగాహన కల్పిస్తున్నారు.
కార్యనిర్వహణాధికారి ప్రారంభ ప్రసంగాన్ని చేస్తూ దేవస్థాన సిబ్బంది, స్థానికులందరు కూడా స్వీయరక్షణకు అవసరమైన అన్ని జాగ్రత్తలు తీసుకోవాలన్నారు.ముఖ్యంగా ఇంటినుండి బయటకు వచ్చినప్పుడు తప్పనిసరిగా మాస్కును ధరించాలన్నారు. అదేవిధంగా ప్రతి రెండు గంటలకు ఒకసారి 20 నుండి 40 సెకన్ల పాటు చేతులను సబ్బు లేదా శానిటైజర్‌తో పూర్తిగా శుభ్రపరచుకోవాలన్నారు. బయటకు వచ్చినప్పుడు తప్పనిసరిగా ఆరు అడుగుల భౌతికదూరాన్ని పాటించాలన్నారు. 60 సంవత్సరాలకు పైబడినవారు, గర్భిణీ స్త్రీలు, 10 సంవత్సరపులోపు వారు వీలైనంత వరకు ఇంటినుంచి బయటకు రాకుండా ఉండడం మంచిదన్నారు. దేవస్థానం సిబ్బంది దర్శనానికి వచ్చే భక్తులకు అవసరమైన జాగ్రత్తలపై అవగాహన కల్పించాలన్నారు.ముందుగా ఆన్ లైన్ లో దర్శనాలకు రిజిస్ట్రేషన్ చేయించుకున్న వారిని మాత్రమే దర్శనానికి అనుమతించాల్సి వుంటుందని చెప్పారు. ఆన్లైన్ ద్వారా పొందిన దర్శనం టోకనును వారి వారి ఆధార్ లేదా ఇతర గుర్తింపుకార్డుతో సరిపోల్చుకుని దర్శనానికి అనుమతించాలన్నారు. ఫేస్ మాస్కును ధరించినవారిని మాత్రమే దర్శనానికి అనుమతించాలని ఆదేశించారు.
దర్శనం క్యూలైన్లలో ప్రవేశించేముందు దేవస్థానం ఏర్పాటు చేసిన ప్రదేశాలలో భక్తులందరు తప్పనిసరిగా శానిటైజర్ లేదా సబ్బుతో చేతులను శుభ్రపరుచుకునే విధంగా తగిన అవగాహన కల్పించాలని కూడా భద్రతా సిబ్బందికి కార్యనిర్వహణాధికారి సూచించారు.
స్థానిక ఐటిడిఏ విభాగపు డిప్యూటీ డిస్ట్రిక్ట్ మెడికల్ అండ్ హెల్త్ ఆఫీసర్ డా. ఎం. శ్రీనివాసరావు మాట్లాడుతూ కరోనా నివారణకు చేపట్టాల్సిన ముందుజాగ్రత్త చర్యలను వివరించారు. తరచుగా కళ్ళు, ముక్కు, నోటిని తాకకూడదన్నారు. దగ్గినప్పుడు లేదా తుమ్మినప్పుడు మోచేతిని అడ్డుపెట్టుకోవాలని లేదా టిష్యూ పేపర్లను ఉపయోగించాలన్నారు. తలుపుల చిలుకులు ( డోర్ హ్యాండిల్), రైలింగులను తాకకూడదన్నారు. వారి వారి మోబైల్ ఫోన్ లో ఆరోగ్యసేతు యాపను డౌన్లోడ్ చేసుకోవాలని సూచించారు. మధుమేహం, గుండెజబ్బులు, రక్తపోటు మొదలైన వ్యాధులతో బాధపడేవారు వారు మందులను క్రమం తప్పకుండా తీసుకోవాలన్నారు. పప్పు, కూరగాయలు, పండ్లు మొదలైన బలవర్ధకమైన ఆహారాన్ని తీసుకోవాలని సూచించారు.
మాస్కు ధరించడం, నిర్ణీత సమయం తరువాత మాస్కును తీసివేయడం, శానిటైజర్ లేదా సబ్బునీటితో చేతులను శుభ్రపరుచుకునే విధానం, శుభ్రపరుచుకోవడంలో గల దశలు, చేతులకు తొడుగులను (హ్యాండ్ ఫ్లాలను) ధరించడం, నిర్ణీత సమయం తరువాత గ్లెను తీసివేయడం, వినియోగించిన మాస్కులను, స్టాన్లను నిర్మూలించే విధానం, ధర్మల్ గన్ ద్వారా శరీర ఉష్ణోగ్రతను పరీక్షించే విధానం, క్యూలైన్లు మొదలైన చోట్ల దేవస్థానం ఏర్పాటు చేయనున్న ఫుట్ ఆపరేటింగ్ శానిటైజింగ్ స్టాండును వినియోగించే విధానం మొదలైన అంశాలు, మొదలైన వాటిని ప్రయోగపూర్వకంగా (డెమోద్వారా) వైద్యులు సిబ్బందికి తెలిపారు.