అమరావతి: పునరుద్పాదక ఇంధన ఉత్పత్తిలో 2 ప్రతిష్టాత్మక పురస్కారాలు సాధించిన నెడ్ క్యాప్ ఎండీ ఎం కమలాకరబాబును అభినందించిన ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు. ప్రోగ్రెసీవ్ స్టేట్ ఏజెన్సీ అవార్డు కింద గోల్డ్ మెడల్, ‘ఎండీ ఆఫ్ ద ఇయర్’ కింద లీడర్షిప్ పురస్కారాన్ని అందుకున్న నెడ్ క్యాప్ ఎండీ కమలాకరబాబు.ఏపీలో 2012లో వెయ్యి మెగావాట్లుగా ఉన్న సౌర, పవన విద్యుత్ ఉత్పత్తిని 2018 నాటికి 7 వేల మెగావాట్లకు పెంచినందుకు గాను ‘ప్రోగ్రెసీవ్ స్టేట్ ఏజెన్సీ ఆఫ్ ధ ఇయర్’ అవార్డును రాష్ట్రం సాధించినట్టుగా ముఖ్యమంత్రికి వివరించిన కమలాకరబాబు.ఢిల్లీలో అందుకున్న పురస్కారాలను ముఖ్యమంత్రికి చూపించిన కమలాకరబాబు.ముఖ్యమంత్రి చంద్రబాబు దూరదృష్టి, విద్యుత్ రంగానికి ఆయన తొలి నుంచి ఇస్తున్న ప్రాధాన్యం వల్లనే ఈ పురస్కారాలను ఏటా పొందగలుగుతున్నామని పేర్కొన్న కమలాకరబాబు.