తూర్పుగోదావరి: వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రాగానే రాష్ట్రంలో ఖాళీగా ఉన్న 2 లక్షల 30 వేల ఉద్యోగాలు ఒకేసారి విడుదల చేస్తామని వైయస్ఆర్సీపీ అధ్యక్షులు వైయస్ జగన్ మోహన్ రెడ్డి హామీ ఇచ్చారు. ప్రతి ఏటా జనవరి 1వ తేదీన ఉద్యోగాల క్యాలండర్ విడుదల చేస్తామని చెప్పారు. కాకినాడ రూరల్ నియోజకవర్గంలోని ఇంద్రపాలెం సభలో ఏర్పాటు చేసిన సభలో వైయస్ జగన్ మోహన్ రెడ్డి ప్రసంగించారు.
- దేవుడిదయ, మీ అందరి ఆశీస్సులతో 25కు 25 ఎంపీ స్థానాలు వైయస్ఆర్సీపీ తరఫున గెలుచుకొని..రేపు పొద్దున తెలంగాణలో 17 మంది ఎంపీలు కూడా ప్రత్యేక హోదా సాధనకు మనకు తోడుగా ఉంటే..ఏపీకి హోదా ఇవ్వాలన్న నినాదం పెద్దది అవుతుంది. కేంద్రంలో ఇవాళ ఏ ఒ క్క పార్టీకి కూడా మెజారిటీ వచ్చే పరిస్థితి లేదు. అలాంటి పరిస్థితిలో ప్రత్యేక హోదాకు మద్దతిస్తు సంతకం చేస్తే వారికే సపోర్టు చేస్తాం. హోదా వస్తే రాష్ట్రానికి పరిశ్రమలు వస్తాయి. ప్రతి జిల్లా హైదరాబాద్ అవుతుంది. ఇవన్నీ చేయడం వల్ల మన పిల్లలకు ఉద్యోగలు ఇక్కడే దొరుకుతాయని నమ్ముతున్నానని జగన్ మోహన్ రెడ్డి చెప్పారు.
- వైయస్ఆర్ సీపీ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థి కురసాల కన్నబాబు, ఎంపీ అభ్యర్థి వంగా గీతాను ఆశీర్వదించమ’ని జగన్ మోహన్ రెడ్డి కోరారు.