ఐ.టి. కొత్త పంథా లో శ్రీశైల దేవస్థానం సేవలు -ఈ ఓ చర్యలు

ఐ.టి. కొత్త పంథా లో శ్రీశైల దేవస్థానం సేవలు అందుబాటులోకి తేవాలని ఈ ఓ కే.ఎస్. రామా రావు చర్యలు తీసుకుంటున్నారు . ఇందులో భాగంగా ఈ రోజు ఈ ఓ ప్రత్యేక సమావేశం ఏర్పాటు చేసారు. ఈ సమావేశంలో ఐ.టి. కంపెనీ నిర్వాహకులు, దేవస్థానం సిబ్బంది పలువురు పాల్గొన్నారు. భక్తులకు సౌకర్యాలు పెంచేందుకు ఐ.టి. ని బాగా వాడాలని ఈ ఓ చెప్పారు.ఆన్ లైన్ ద్వారా ఆర్జిత సేవా టిక్కెట్లు, వసతి సౌకర్యం సులువుగా పొందటానికి తగిన చర్యలు ఉండాలన్నారు. దీనికి సంబంధించి తగిన ప్రచారమూ చేయాలని ఆదేశించారు. వివిధ కౌంటర్లలో నగదు రహిత లావాదేవీలు ఎక్కువగా ఉండేలా చర్యలు తీసుకోవాలన్నారు.

దేవస్థానం website ను నవీకరణ చేయాలని ఈ ఓ ఆదేశించారు. అప్డేట్ సమాచారం అవసరమని ఈ ఓ చెప్పారు.

శ్రీశైలప్రభ మాస పత్రిక వార్షిక చందాను కూడా ఆన్ లైన్ ద్వారా చెల్లించేందుకు అవకాశం ఉండాలని ఈ ఓ చెప్పారు. ఈ ఓ ఇంకా శ్రీశైల ప్రభ గురించి పలు సూచనలు చేసారు. దేవస్థానం వెలువరిస్తున్న ఈ తెలుగు , కన్నడ మాస పత్రికలను దేవస్థానం website లో ఉంచాలన్నారు. ఇందుకు దేవస్థానం website లో ఇ-బుక్ సదుపాయం ఉంచాలని ఈ ఓ ఆదేశించారని దేవస్థానం ఎడిటర్ మీడియా కు తెలిపారు.

కాగా ఈ ఓ ఈ రోజు దేవస్థానం లో వివిధ చోట్ల కలియ తిరిగి పరిశీలించారు.

print

Post Comment

You May Have Missed