ఐపిసిలో 506, 507 సెక్షన్ల కింద పేర్కొన్న నేరాలను కోర్టు అనుమతి లేకుండానే (cognizable) విచారించదగిన నేరాలుగా తెలంగాణ ప్రభుత్వం గుర్తించింది. దీనికి సంబంధించిన ఫైలుపై ముఖ్యమంత్రి శ్రీ కె. చంద్రశేఖర్ రావు గురువారం సంతకం చేశారు. ఈ సెక్షన్ల కింద పరుష పదజాలంతో బెదిరించడం నేరాలుగా పరిగణించబడ్డాయి. అయితే ఈ నేరాల కింద కేసు నమోదు చేయడానికి కోర్టు అనుమతి తీసుకోవాలా? కోర్టు అనుమతి లేకుండానే కేసు నమోదు చేసి విచారణ చేపట్టాలా? అనే విషయాన్ని రాష్ట్ర ప్రభుత్వాల విచక్షణ కిందికి వస్తుంది. ఆయా రాష్ట్రాలే దీనిపై నిర్ణయం తీసుకోవాల్సి ఉంది. పరుష పదజాలంతో దుషించడాన్ని కోర్టు అనుమతి లేకుండానే కేసు నమోదు చేసి విచారణ చేపట్టే నేరంగా తెలంగాణ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది.