విజయవాడ : ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని విశ్వవిద్యాలయాల ఉపకులపతులతో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సమావేశం.
*ప్రభుత్వం ఏర్పాటు చేసి 1500 రోజులయ్యింది. ఏ రంగంలో ఎక్కడ మన ప్రస్థానం ప్రారంభించాం, ఇప్పుడిక్కడ ఎక్కడ ఉన్నాం, ఇది సమీక్షించుకుంటున్నాం.అన్ని రంగాల అభివృద్దిలో మైలురాళ్లు సాధించాం. ఏ రంగం అభివృద్ధి చెందాలన్నా ముఖ్యంగా విద్యారంగంలో సాధించే ప్రగతే ఆధారం.రాష్ట్రాన్ని వైజ్ఞానిక కేంద్రంగా తీర్చిదిద్దాలన్నదే ధ్యేయం.ఒకప్పుడు ఐటీని అభివృద్ధి చేశాం. 20 ఏళ్లలో తెలుగువాళ్లు ప్రపంచంలోని అన్ని మూలలకు చొచ్చుకు వెళ్ళిపోయారు. సిలికాన్ వ్యాలీలో మనవాళ్లదే పైచేయి.