తాడేపల్లి: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కొత్తగా 13 మోడల్ డిగ్రీ కాలేజీలు ఏర్పాటు చేస్తూ ప్రభుత్వం ఉత్తర్హులు జారీ చేసింది. ప్రతిజిల్లాలోనూ ఒక డిగ్రీ కాలేజీని మోడల్ కాలేజీగా తీర్చిదిద్దాలని ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది.ఇందుకోసం రూ.40.62 కోట్లు ఖర్చు చేసేందుకు ఏపీ ప్రభుత్వం అనుమతి ఇచ్చింది. ప్రభుత్వ డిగ్రీ కాలేజీలను జీడీసీ ఎంపిక చేస్తుందని ఉత్తర్హుల్లో పేర్కొంది. నేషనల్ ఇనిస్టిట్యూషనల్ ర్యాకింగ్ ఫ్రేమ్ వర్క్‌కు పైలెట్ ప్రాజెక్టుగా చేపట్టనున్నారు.