Skip to content
అమరావతి: రాష్ట్రంలో ఐదు కోట్లమంది ప్రత్యేకంగా ఎంతో ఆసక్తిగా, ఈసారైనా న్యాయం చేస్తారని ఎదురు చూశారు
కానీ నిరాశే ఎదురయ్యింది
మెజారిటీ Vs మొరాలిటీ
వారికి మెజారిటీ ఉంది.కానీ ధర్మాన్ని పాటించలేదు
ప్రధాని మాటలు చాలా బాధలు కలిగించాయి
ఏపీ అంటే చులకనగా మాట్లాడారు. ఏపీ అంటే అంత చులకనా
నేనేదో యూటర్న్ తీసుకున్నానని చెబుతున్నారు
మోడీ మాటలు చూస్తే.. మోడీని ఎదుర్కోవడానికి, ఆయన్ని గద్దె దించడానికే అవిశ్వాసం పెట్టామట
అహంకారంతో నో కాన్ఫడెన్స్ పెట్టామట
అహంకారం నాకు కాదు. ప్రధానికే
ఏదో భూకంపం వస్తుందన్నారు
అన్ని ప్రయత్నాల తర్వాతనే చివరి అస్త్రంగా నో కాన్ఫిడెన్స్ మోషన్ పెట్టాం
నాకు, కేసీఆర్ కు గొడవలున్నాయని మాట్లాడారు
రాష్ట్రాన్ని విభజించాలంటే ఇద్దరినీ కూర్చోబెట్టి ఇద్దరికీ న్యాయం చేయాలని అడిగాను
కాంగ్రెస్ పార్టీ అన్యాయం చేసిందని చెప్పే మీరు నాలుగేళ్లుగా ఒక్కపని కూడా చేయకుండా అన్యాయం చేయలేదా?
125 ఏళ్ల కాంగ్రెస్ ను ప్రజలు తిరస్కరించారు
ప్రత్యేక హోదాకు 14వ ఆర్ధిక సంఘం నిబంధనలు అడ్డువచ్చాయని ప్రధాని చెప్పేటం సరికాదు
ఏ విధంగా విభజించాలనే అంశాలపై ఫైనాన్స్ కమిషన్ వేశారు
కేంద్ర, రాష్ట్ర సంబంధాలు కొత్తకాదు
ప్రధాని స్థాయి వ్యక్తి చవకబారుగా మాట్లాడటం చూసి బాధవేసింది
నేను న్యాయం చేస్తున్నానని మీరు ఎందుకు చెప్పలేకపోయారు
ఆ అహంభావం ఎందుకు?
అరవై ఏళ్లు కష్టపడ్డాం. న్యాయం చేయమని అడిగాం. అందులో తప్పులేదు
అరవైఏళ్లు కష్టపడి కట్టుబట్టలతో, నెత్తిన అప్పులతో బయటికి వచ్చాం
విభజన చేసింది కేంద్రం
కేంద్రం ఆదుకోవాలి
అందరం కష్టపడి రెండంకెల వృద్ధి రేటు వచ్చింది
కానీ దక్షిణాదిలో ఆదాయంలో అన్ని రాష్ట్రాలకంటే వెనుకబడి ఉన్నాం
ఆదుకోవాల్సిన బాధ్యత మీకు లేదా
కేంద్రం అణచివేసే ధోరణిలో, తెలుగుజాతి అంటే లెక్కలేదు
దిక్కున్న చోట చెప్పుకోండి అని అనడం దారుణం
మేం వైఫల్యాలు కప్పిపుచ్చుకోవడానికి యూ టర్న్ తీసుకున్నామట?
అన్ని ప్రయత్నాలు చేశాం
29 పర్యాయాలు ఢిల్లీ వచ్చాం
ఇక న్యాయం జరగదని భావించే అన్ని చర్యలు
తెలుగుదేశం పార్టీ ఎక్కడా రాజీపడదని చెప్పాం
ప్రత్యేక హోదాకు ఇచ్చే అన్ని బెనిఫిట్స్ ప్రత్యేక ప్యాకేజీ ఇస్తామంటే అంగీకరించాం
ఇప్పుడు స్పెషల్ పర్పస్ వెహికిల్ అంటున్నారు
చరిత్రలో ఒక రాష్ట్ర ప్రభుత్వం పెట్టిన అవిశ్వాస తీర్మానానికి మద్దతుగా అన్ని పార్టీలు ఒక్కటయ్యాయి
ఇది ఎంతో అరుదైన విషయం
లోక్ సభలో అవిశ్వాస తీర్మానానికి అనుకూలంగా 126 మంది ఓటు వేశారు.
అన్ని పార్టీలు అంగీకరించినా మీకెందుకు కినుక?
కడప ఉక్కు ఫ్యాక్టరీ ఇవ్వరు.
ప్రధాని స్థాయి వ్యక్తి అంత దిగజారి మాట్లాడటం సరికాదు
ఆనాడు పార్లమెంటులో బిల్లుపెట్టి పాస్ చేశారు
ఒక అవినీతి పార్టీని పక్కన పెట్టుకుని రాజకీయ లబ్ది కోసం రాష్ట్రానికి అన్యాయం చేయాలని అనుకోవటం చాలా దుర్మార్గం: చంద్రబాబు
మాతో రండి. రాజీనామాలు చేస్తామని వైసీపీ అన్నది
మీతో కలసి వస్తే కుక్కతోక పట్టుకుని గోదావరి ఈదినట్లే
మరోవైపు పవన్ కల్యాణ్
ఇవాళ దేశమంతా ఆసక్తిగా ఎదురు చూస్తుంటే..
మాకు న్యాయం చేయండి అని ప్రధాని ప్రసంగాన్ని సభ్యులు అడ్డుకునే పరిస్థితి వచ్చిందంటే సమస్య తీవ్రతను గమనించాలి
ప్రధాని నన్ను విమర్శించడమేమిటి?: ముఖ్యమంత్రి
నరేంద్రమోడీ గారిని పదవి నుంచి తొలగించేందుకు ఈ అవిశ్వాసం పెట్టామని అంటున్నారు
ఎన్నెన్ని సెషన్స్ లో పార్లమెంటు జరగకుండా చేశారు
మీకు మెజారిటీ ఉందని తెలుసు. మీ ప్రభుత్వం ఉంటుందని తెలుసు
కానీ మాకు చేసిన అన్యాయాన్ని ఎంగట్టడానికి, దేశం దృష్టికి తేవడానికే అవిశ్వాసం పెట్టాం
అన్యాయాన్ని ఎదుర్కోవడానికే అవిశ్వాసం
ధర్మపోరాటం చేస్తున్నాం
ప్రధానమంత్రికి గంటన్నర ఇచ్చినప్పుడు అందుకు సమాధానం చెప్పడానికీ సమయం ఇవ్వాలి
మోడీ పైనే నమ్మకం పోయింది
ప్రధాని అంటే ప్రధానిగా చూస్తాం
కాంగ్రెస్ గత ప్రధానులను దించివేసిందని సందర్భంలేని విషయాలు చెప్పారు
స్పెషల్ స్టేటస్ ఎవరికీ ఇవ్వమూ అని చెప్పి 11 రాష్ట్రాలకు అన్ని బెనిఫిట్స్ ఇచ్చారు
ఇది బ్రీచ్ ఆఫ్ ట్రస్ట్ కాదా?
14 వ ఆర్ధిక సంఘ చైర్మన్ విభజనతో మాకు సంబంధం లేదని చెప్పారు
కానీ ఒక ప్రధాని ఇంత దుర్మార్గంగా మాట్లాడటం సరికాదు
ఆరోజు మట్టి, నీళ్లు తెస్తే సంఘీభావంగా తెచ్చారనుకున్నాం
సెంటిమెంట్స్ తో ఆడుకోవడం మంచిది కాదు
విభజన తర్వాత మాకు ఉద్యోగాలు వస్తాయా? పెన్షన్లు వస్తాయా అని ప్రజల్లో భయాందోళనలున్నాయి
ఫ్యాక్ట్స్ అండ్ ఫిగర్స్ ముందుపెట్టాం
మీకు బాధ్యత లేదా? : చంద్రబాబు
ప్రజలకు చెప్పాలి
మీమాట వినలేదని మీకు నాపై కోపం ఉండవచ్చు
కానీ మేం ఏ ప్రయోజనం కోసం మీతో కలిశాం
ఇన్నాళ్లు అడిగీ అడిగీ సాధించలేకపోయాం
ఇక ధర్మపోరాటం ద్వారా సాధిస్తామన్న విశ్వాసంతో సాగుతున్నాం
న్యాయం జరిగేదాకా పోరాటం ఆగదు
నవనిర్మాణ దీక్షతో సంకల్పం తీసుకుని అభివృద్ధికి అనుగుణంగా ప్రజలను ట్యూన్ చేయడానికి కృషి చేశాం
పోరాటాలతో, అల్లర్లతో ముందుకెళితే అభివృద్ధిలో వెనుకబడి ఉండేవాళ్లం
మనిషి మాట్లాడినప్పుడల్లా మనసు ఒకటి ఉంటుంది
మనం సంపాదించిన డబ్బు న్యాయమైనదేనా అని ఆలోచన వస్తుంది.
బ్యాంకుల పవిత్రత కాపాడాతామన్నారు
పెట్రోలియం ధరలు పెరుగుతున్నాయి
ప్రధాని స్థాయి వ్యక్తి ప్రైవేటు ఉద్యోగాల గురించి మాట్లాడుతున్నారు
ఏపీని మళ్లీ మోసం చేశారు
కొంతవరకైనా కాన్ఫిడెన్స్ క్రియేట్ చేయలేకపోయారు
అవమానించే పరిస్థితికి వచ్చారు
నో కాన్ఫిడెన్స్ పెడితే ఇష్టానుసారం సమయం కేటాయించారు
మనకు సంఖ్యాబలం లేదని ఇష్టానుసారం
రాష్ట్ర ప్రజలు శనివారం ఎక్కడికక్కడ నిరసన తెలియజేయండి
రాష్ట్ర ప్రజలు సంఘీభావం ప్రకటించాలి
బీజేపీకి వంత పాడుతూ రాష్ట్ర ప్రయోజనాలను దెబ్బతీస్తున్న వ్యక్తులకు గుణపాఠం చెప్పాల్సిన అవసరం ఉంది
ఎప్పుడూ జరగని అన్యాయం జరిగింది
ఇంత అన్యాయం జరిగినా సంఘీభావం తెలియజేయకుండా, మనల్నే దెబ్బతీస్తున్నారు. ఇది దారుణం
పార్లమెంటులో పోరాడిన వారిని అభినందించాలి. కానీ వారి మనో స్థయిర్యాన్ని దెబ్బతీసేవరకూ వచ్చారు
పొగరు అనుకోవాలా?
రాజీనామా చేస్తే ఎన్నికలు రాకూడదని, నాటకాలు ఆడేపరిస్థితికి వచ్చారు.
ఎంపీలుగా ఉంటేనే లోపలికి రానివ్వరు. ఎంపీ పదవులు లేకపోతే రానిస్తారా?
ఎలా న్యాయం జరగుతుంది?
నరేంద్రమోడీతో లాలూచి పడ్డారు.
బీజేపీ ఎంపీ హరిబాబు ఎందుకు అంత ఊగిపోతూ మాట్లాడారు?
అమ్మపెట్టదు. అడుక్కుతిననివ్వదు సామెతను బీజేపీ ప్రభుత్వ నిజం చేసింది: ముఖ్యమంత్రి
విభజన చట్టంలోదే అడిగాం
మోడీగారు బుల్లెట్ ట్రైన్ కు లక్షకోట్లు ఇచ్చుకున్నారు
మీ రాష్ట్రంపై మీకు ప్రేమ ఉన్నప్పుడు మా రాష్ట్రం మీద మాకు ప్రేమ ఉండదా
నేను రాష్ట్రం కోసం కలిశాను. ప్రయోజనం నెరవేర్చలేదు. బయటికి వచ్చాం