తిరుమల, 2020 డిసెంబరు 21: ఢిల్లీకి చెందిన ప్రముఖ వ్యాపారవేత్త శ్రీ జైన్ టిటిడికి చెందిన శ్రీ వేంకటేశ్వర భక్తి ఛానల్ కు రూ.1.20 కోట్ల విలువైన డి.ఎస్.ఎన్.జి వాహనాన్ని సోమవారం విరాళంగా అందించారు.
శ్రీవారి ఆలయం ఎదుట జరిగిన కార్యక్రమంలో ఈ వాహనానికి అర్చకులు ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం దాత శ్రీ జైన్ వాహనం తాళాలను టిటిడి అదనపు ఈవో, ఎస్వీబీసీ ఎండి ఎ.వి.ధర్మారెడ్డికి అందజేశారు.
ఈ కార్యక్రమంలో ఎస్వీబీసీ సిఈఓ జి.సురేష్ కుమార్, ఆలయ డిప్యూటీ ఈవో హరీంద్రనాథ్, పేష్కార్ జగన్మోహనాచార్యులు తదితరులు పాల్గొన్నారు.