సర్వేపల్లి: దేశం మొత్తం ఎవరీ నాయకుడు, ఏమిటీ ధైర్యం అని తిరిగి చూస్తోంది.. ఆ నాయకుడు.. మన ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్రెడ్డి అని వ్యవసాయ శాఖ మంత్రి కురసాల కన్నబాబు అన్నారు. సీఎం వైయస్ జగన్ను తిరుపతి ఎయిర్పోర్టులో అడుగు పెట్టగానే వర్షం.. సర్వేపల్లిలో హెలికాప్టర్ దిగిన వెంటనే వర్షం.. వైయస్ జగన్ అడుగు పెడితే ప్రకృతి కూడా పులకరిస్తుందన్నారు. దేశంలో ఏ ముఖ్యమంత్రి చేయని సాహసం వైయస్ఆర్ రైతు భరోసా పథకాన్ని సీఎం అమలు చేస్తున్నారన్నారు. రైతు భరోసా పథకం ప్రారంభోత్సవంలో మంత్రి కన్నబాబు మాట్లాడుతూ.. వ్యవసాయం అనేది వృత్తి కాదు.. జీవన విధానం.. దాన్ని కాపాడుకోకపోతే అభివృద్ధి, పుట్టగతులు ఉండవని నమ్మి ప్రమాణస్వీకారం రోజే రైతు పక్షపాత ప్రభుత్వం అని ప్రకటించిన సీఎం వైయస్ జగన్కు ప్రజలందరి తరుఫున కృతజ్ఞతలు తెలుపుతున్నానన్నారు.
ఇంతకు ముందు విదేశీ నేతలతో పోల్చుకునేవారు.. సీఈఓలుగా పేరుతెచ్చుకోవాలనుకున్నారని మంత్రి కన్నబాబు అన్నారు. మన ముఖ్యమంత్రి వైయస్ జగన్ రైతుల గుండెల్లో స్థానం కల్పించుకోవాలి.. రైతు కళ్లలో ఆనందం చూడాలనే తపిస్తున్నారన్నారు. దాదాపు 54 లక్షల రైతు కుటుంబాలకు వైయస్ఆర్ రైతు భరోసా పేరిట పెట్టుబడి సాయం అందించనున్నారన్నారు. లక్షల మందికి ఏకకాలంలో ఇవాళే.. సాయం అందిస్తున్నామన్నారు. ఖరీఫ్, రబీలో సాయం అందించేలా చూడాలని రైతు సంఘాలు సూచన చేస్తే వెంటనే పెట్టుబడి సాయాన్ని రూ.12,500 నుంచి రూ.13,500 పెంచి ఖరీఫ్, రబీ, సంక్రాంతి కానుకగా మూడు విడతల్లో ఇచ్చేలా నిర్ణయం తీసుకున్నారన్నారు.