ఎన్నో జన్మల పుణ్య ఫలితం శ్రీశైల దర్శన భాగ్యం – చాగంటి

శివాభిషేకం లోక కల్యాణ కారకమని బ్రహ్మశ్రీ  చాగంటి కోటేశ్వర రావు చెప్పారు . పరమేశ్వరుడు  ఐశ్వర్య కారకుడని , కుబేరుడు శివానుగ్రహం  వల్లనే  ధనాధిపతి  అయ్యాడని చాగంటి వారు వివరించారు. చాగంటి వారి ప్రవచనాలు సోమవారం ముగిసాయి. శ్రీశైలం ఆలయ దక్షిణ మాడ వీధిలో ప్రత్యేకంగా ఏర్పాటుచేసిన  వేదికపై  ఈ నెల 23 నుంచి బ్రహ్మశ్రీ చాగంటి ”   మల్లికార్జున సుప్రభాత వైభవం ”  ప్రవచనాలు చేస్తున్నారు. చివరిరోజు అనేక అంశాలను  వారు వివరించారు. ముందుగా అర్చక స్వాములు , వేద పండితులు జ్యోతి ప్రజ్వలన చేసారు.  దేవస్థానం కార్య నిర్వహణ అధికారి చాగంటి వారిని వేదికపైకి  ఆహ్వానించారు. పరమేశ్వరుడు కాలాతీతుడని  అన్నారు. పరమేశ్వరుడు , పరాశక్తి  జగత్తుకు మాతపితరులుగా  ప్రసిద్ధం అయ్యారని చాగంటి వారు వివరించారు. ఎన్నో జన్మల పుణ్య ఫలితంగానే శ్రీశైల దర్శన భాగ్యం కలుగుతుందన్నారు. శివలీల రూపా విశేషాలు, శివ కేశవుల అభేదం , పాతాళగంగ విశేషాలు చెప్పారు. హాలహల భక్షణం, మార్కండేయ వృత్తాంతం, అర్జునుని తపస్సు , అర్జునునికి పాశుపతాస్త్ర అనుగ్రహం ,  కన్నప్ప వృత్తాంతాలను, త్రిపుర సంహారం, గజాసుర సంహారం మొదలైన అంశాలను చెప్పారు. ముగింపులో దేవస్థానం అర్చక స్వాములు చాగంటి వారికి ప్రసాదాలను అందించారు. దేవస్థానం ఈ.ఓ. చాగంటి వారికి శేష వస్త్రాలు అందించి ఘనంగా సత్కరించారు. ఈ మూడు రోజుల ప్రవచన కార్యక్రమానికి భక్తులు , స్థానికులు భారీగా  హాజరయ్యారు.

print

Post Comment

You May Have Missed