శ్రీ అహోబిల లక్ష్మీ నరసింహస్వామి బ్రహ్మోత్సవాలలో భాగంగా నేడు ఎగువ అహోబిలం లో
శ్రీ అహోబిలం దేవాలయ పరంపర ధర్మకర్త శ్రీ అహోబిల మఠం 46వ పీఠాధిపతి వారి అధ్యక్షతన కల్యాణోత్సవం నయన మనోహరంగా జరిగింది.
As a part of Ahobilam brahmothsavam kalyanothsavam is celebrated under the divine presence of his holiness 46th peetaadhipathi of sri Ahobila math the hereditary trustee to Ahobilam temple in upper Ahobilam.
కశిపుని చంపి వీరము చూపినవాడు నేడు తీగె నవ్వులు చిందిస్తూ శృంగార రసమును చూపుతున్నాడు.
సింహ ముఖము తో నున్నవాడు చెంచిత కౌగిలి వలలో చిక్కినాడు.
హరబ్రహ్మాదులకు దేవుడైన వాడు నేడు సామాన్యుని నుండి ఆశీర్వాదం పొందుతున్నాడు.
ఆకాశమే పందిరిగా
భూలోకమే పెళ్లిపీటలుగా
జీవ నాయికలు ముత్తైదువులుగా
అహోబిల గిరులు కళ్యాణ వేదికగా
భవనాశిని నది చేయు సవ్వడి వేదం మంత్రాలుగా
చుక్కలు తలంబ్రాలుగా
దిక్కులు బాసికాలుగా
చంద్రుని వెన్నెల హోమ కుండముకాగా
అడవితేనే మధుపర్కముగా
మదన కలలే మాంగల్యముగా చేసుకొని
దేవ దుందుభులు మోగంగా
సురకాంతలు ఆడంగా
నారాదాదులు పాడంగా
చెంచులక్ష్మి మేడలోన తిరుమాంగళ్యము కట్టి
ముసి ముసి నవ్వులు చిందించే
అహోబలేశుడు……..
*As a part of Ahobilam brahmothsavam kalyanothsavam is celebrated under the divine presence of his holiness 46th peetaadhipathi of sri Ahobila math the hereditary trustee to Ahobilam temple in upper Ahobilam.