ఎంసెట్-2 రద్దు చేస్తున్నట్లు తెలంగాణ ప్రభుత్వం అధికారికంగా ప్రకటించింది
తప్పని పరిస్థితుల్లోనే ఎంసెట్-3 * తల్లిదండ్రులు సహృదయంతో అర్థం చేసుకోవాలి : సీఎం…. ఇప్పటికే పరీక్ష రాసి మంచి ర్యాంకులు సాధించిన విద్యార్థుల చేత మరోసారి పరీక్ష రాయించడం బాధాకరమైన విషయము * ఎంసెట్-2 లీకేజీ కావడం దురదృష్టకరం * ఎంసెట్ -3 బాధ్యతలు జేఎన్టీయూకే * సాయంత్రం షెడ్యూల్ విడుదల * ఎంసెట్-2 రాసిన విద్యార్థులు తిరిగి దరఖాస్తు చేసుకునే అవసరం లేకుండా, మళ్లీ ఫీజు చెల్లించాల్సిన అవసరం లేకుండా పాత హాల్ టిక్కెట్లతోనే అనుమతిం * పరీక్ష రాయడానికి వెళ్లే విద్యార్థులకు ఆర్టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణ వసతి, అవసరమైన చోట ప్రత్యేక బస్సులు * విద్యార్థులు ప్రవేశ పరీక్షకు సిద్ధమయ్యేందుకు జె.ఎన్.టి.యు వెబ్ సైట్ లో స్టడీ మెటీరియల్ * : ముఖ్యమంత్రి శ్రీ కె. చంద్రశేఖర్ రావు