సామాజిక ఉద్యమకారుడు, దళిత బహుజన మేధావి ఉ.సా. (ఉల్లెంగుల సాంబశివరావు) అకాల మరణం దళిత బహుజనులకు తీరని లోటు అని తెలంగాణ రాష్ట్ర మీడియా అకాడమీ చైర్మన్ అల్లం నారాయణ అన్నారు.జీవితాంతం ప్రజల కోసం ప్రజా సమస్యల పరిష్కారం కోసం అనునిత్యం పోరాడారని అన్నారు. ఆయన వ్రాసిన అంశాలు వివిధ పత్రికలలో అచ్చయ్యాయని అన్నారు. ఆయన కరోనా బారిన పడి మరణించడం దురదృష్టకరమని అన్నారు. ఉ.సా. కుటుంబ సభ్యులకు చైర్మన్ అల్లం నారాయణ ప్రగాఢ సానుభూతిని వ్యక్తం చేశారు.