మూడు దశాబ్దాలకుపైగా కర్నూలు వాసులకు ఉచిత హోమియో వైద్య సేవలు అందిస్తున్న రాధాస్వామి సత్సంగ్ ఛారిటబుల్ డిస్పెన్సరీ ఆధ్వర్యంలో సేవ కారక్రమాలు కొనసాగుతున్నాయి. కర్నూలులో ప్రధానంగా వాడవాడలో ఉచిత హోమియో వైద్య శిబిరాలు అవసరమైనప్పుడల్లా నిర్వహిస్తున్నారు. విషజ్వరాలు సోకకుండా ముందు జాగ్రత్త గా మందుల పంపిణీ చేస్తున్నారు . డాక్టర్ కె.భాస్కర్ రెడ్డి తన బృందంతో కలసి కర్నూలు నగరంలో శిబిరాలు ఏర్పాటు చేసి ఉచితంగా హోమియో మందులు అందచేస్తున్నారు.