భద్రాచలంలోని ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ మారుతీ నర్సింగ్ కళాశాల,అవొపా,లయన్స్ క్లబ్,వికాస తారంగణి భద్రాచలం వారి సహకారంతో రెడ్ క్రాస్ బిల్డింగ్ వద్ద చూపు మందగించిన వారికి బుధవారం ఉచితంగా కళ్ళ జోళ్ళ పంపిణీ కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమాని కి ముఖ్య అతిధిగా భద్రాద్రి కొత్తగూడెం జిల్లా జాయింట్ కలెక్టర్ రామ్ కిషన్ పాల్గొని ఈ కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో భద్రాచలం తహసీల్దార్ రామకృష్ణ,డాక్టర్ కాంతారావు, డాక్టర్ సుబ్బరాజు,తిప్పి సిద్ధులు, డాక్టర్ భానుప్రసాద్,చారుగుళ్ళ శ్రీనివాస్, సూర్య నారాయణ,వెంకటచారి, కృష్ణ మోహన్,అబ్రహాం,రాజారెడ్డి, బట్టర్,శంకర్రావు,కిరణ్మయి, మాధవరెడ్డి,వేణు,రమణారెడ్డి,సుధాకర్ తదితరులు పాల్గొన్నారు.