ఉగాది న ఇళ్ల పట్టాల పంపిణీ కార్యక్రమం-వైఎస్‌ జగన్‌

అమ‌రావ‌తి:  పేదవారి సొంతింటి కలను సాకారం చేసేందుకు ఉగాది నాడు ఇళ్ల పట్టాల పంపిణీ కార్యక్రమం చేపడతామని ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి తెలిపారు. సోమవారం కలెక్టర్ల సమావేశంలో ఆయ‌న మాట్టాడుతూ ఇళ్ల పట్టాలను మహిళల పేరుతో పంపిణీ చేయనున్నట్టు చెప్పారు. ఇళ్ల పట్టాలకు సంబంధించి అధికారులు సమాయత్తం కావాలని, భూమి లభ్యత లేనిచోట కొనుగోలు చేయాలని సూచించారు. ఇంటి పట్టా ఇవ్వడమే కాదు, స్థలం ఎక్కడుందో లబ్ధిదారులకు స్పష్టం చూపించాలన్నారు. ఉగాది రోజున ఇళ్లస్థలాల రిజిస్ట్రేషన్‌ ఒక పండుగ లాగ చేయాలన్న ఆకాంక్షను సీఎం జగన్‌ వెలిబుచ్చారు. అధికారులు విశ్వసనీయత కాపాడుకోవాలని.. ఏ విధానమైనా అందరికీ ఒకేలా ఉండాలని తర, తమ భేదం వద్దని పేర్కొన్నారు.

వైఎస్సార్‌ రైతు భరోసా పథకాన్ని రాష్ట్ర వ్యాప్తంగా పెద్ద పండుగలా నిర్వహించాలని  వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి కలెక్టర్లకు సూచించారు. పథకం ద్వారా లబ్ధిపొందే మొత్తాన్ని రైతులకు ఒకే రోజు ఇవ్వాలని సీఎం నిర్ణయించారు. ఈ మేరకు జిల్లా కలెక్టర్ల సదస్సులో ఆయన పలు కీలక ఆదేశాలను జారీ చేశారు. వాస్తవంగా రైతు భరోసాను మే మాసంలో ఇవ్వాల్సిఉందని, కానీ రైతుల దుస్థితిని చూసి అక్టోబరులోనే రబీ సీజన్‌ కోసం ఇస్తున్నామని సీఎం తెలిపారు. ప్రతి రైతు కుటుంబానికి రూ.12,500 గ్రామ వాలంటీర్ల ద్వారా పంపిణీ చేస్తామన్నారు. రాష్ట్రంలో 1.25 ఎకరాల కన్నా తక్కువ భూమి ఉన్న రైతులు 50శాతం, 2.5 ఎకరాల కన్నా తక్కువ ఉన్న భూమి ఉన్న రైతులు 70శాతానికి పైగా రైతులు ఉన్నారని వెల్లడించారు. ‘50శాతం మంది రైతులకు కావాల్సిన పూర్తి పెట్టుబడి రైతు భరోసా ద్వారా అందుతున్నట్టే.

అక్టోబరు 15న రైతు భరోసా అందుతుంది. స్టాంపు పేపర్‌ ఫార్ములా మాదిరిగానే ఒక పత్రాన్ని కౌలు రైతుల కోసం గ్రామ సచివాలయంలో ఉంచుతాం. 11 నెలల కాలానికి భూమిపై హక్కులు కాకుండా, పంట సాగు చేసుకునేలా అనుమతులు రైతుల నుంచి కౌలు రైతులకు అందేలా చూడాలన్నది ప్రభుత్వం ఆలోచన. దీనివల్ల కౌలు రైతులకు కొంత మంచి జరిగే అవకాశం ఉంది. రైతు భరోసా కింద బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీ కౌలు రైతులకు కూడా రూ.12500 ఇచ్చే ఏర్పాటుచేస్తాం. ఆత్మహత్య చేసుకున్న రైతులకు గత ప్రభుత్వం సరిగ్గా పరిహారం ఇవ్వలేదు. ఈ పరిస్థితులు పూర్తిగా మార్చబోతున్నాం. రైతు కుటుంబాలకు ఏం జరిగినా.. ఆత్మహత్య జరిగినా, ప్రమాదంలో మరణించినా స్థానిక కలెక్టర్‌ వెంటనే స్పందించాలి. ముఖ్యమంత్రి కార్యాలయం ఆదేశాలతో పనిలేకుండా వెంటనే స్పందించి ఆ కుటుంబం దగ్గరకు వెళ్లాలి. స్థానిక ఎమ్మెల్యేను కూడా కలుపుకొని ఆ కుటుంబానికి రూ.7 లక్షలు ఆర్థిక సహాయం అందించాలి. సీఎం మీకు తోడుగా ఉంటారని రైతు కుటుంబానికి భరోసా ఇచ్చి.. మీరు ఆ కుటుంబానికి సహాయం చేయండి’ అని పేర్కొన్నారు.

రాష్ట్రంలోని ప్రతి పౌరుడు ఒక మొక్కను నాటాలని ముఖ్యమంత్రి వైయ‌స్‌ జగన్‌మోహన్‌రెడ్డి పిలుపునిచ్చారు.   రాష్ట్రంలోని మొత్తం 5 కోట్ల మంది ఐదు కోట్ల మొక్కలను నాటాలని తన ఆలోచన అన్నారు. మొక్కలను నాటే కార్యక్రమంలో గ్రామ వాలంటీర్లను భాగస్వాములుగా చేయాలని కలెక్టర్లకు సూచించారు. స్కూళ్లు, ఆస్పత్రులలో చెట్లను నాటేలా చర్యలు చేపట్టాలని ఆదేశించారు. చెట్ల సంరక్షణ బాధ్యతలను సీఎస్‌ఆర్‌ కింద పరిశ్రమలకు ఇవ్వాలని సూచించారు. మొక్కలు నాటడం, సంరక్షణపై శ్రద్ధ చూపాలన్నారు.

ఉచిత విద్యుత్‌పై చ‌ర్చ
రైతులకు ఉచిత విద్యుత్‌ అంశాన్ని ప్రాధన్య అంశంగా భావించి పనులు వేగవంతం చేయాలని కలెక్టర్లకు ముఖ్యమంత్రి వైయ‌స్‌ జనన్‌మోహన్‌రెడ్డి ఆదేశించారు.  రైతులకు పగటి పూట 9 గంటల ఉచిత విద్యుత్‌పై చర్చించారు. ఉచిత విద్యుత్‌ పనులను యుద్ధ ప్రాతిపదికన చేపట్టాలని అధికారులను ఆదేశించారు. ఫీడర్ల వారిగా ప్రణాళిక ఇవ్వాలని చెప్పారు. రాష్ట్రంలో ఎన్ని పంపుసెట్లకు కనెక్షన్లు ఇవ్వాలని అధికారులను సీఎం జగన్‌ ప్రశ్నించారు. రాష్ట్ర వ్యాప్తంగా దాదాపు 57వేలకు పైగా పంపుసెట్లకు కనెక్షన్లు ఇవ్వాలని అధికారులు సీఎంకు తెలిపారు. నిర్ణిత సమయంలో వాటిని పూర్తి చేయాలని సీఎం వైయ‌స్ జగన్‌ ఆధికారులను ఆదేశించారు.

 ప్రజల ఆకాంక్షల మేరకు ప్రభుత్వం పనిచేయాలని సీఎం వైయస్‌ జగన్‌మోహన్‌రెడ్డి అన్నారు. కలెక్టర్ల సమావేశంలో ఆయన మాట్లాడుతూ భవిష్యత్‌ ప్రణాళికను వివరించారు. పాలకులం కాదు..ప్రజలకు సేవకులం అని ప్రతి క్షణం గుర్తుండాలని సూచించారు. ప్రతి కలెక్టర్,సెక్రటరీ,మంత్రి దగ్గర  మేనిఫెస్టో కాపీ ఉండాలన్నారు. మేనిఫెస్టో అనే పదానికి అర్థం కూడా తెలియని పరిస్థితుల్లో పరిపాలన సాగుతున్న పరిస్థితుల్లో మార్పు రావాలి. మేనిఫెస్టో అనేది ఒక భగవద్గీత,ఖురాన్,బైబిల్‌గా భావించాలి. మేనిఫెస్టోలోని అంశాలను అమలు చేస్తామని చెప్పి ప్రజలు నమ్మకంతో ఓట్లు వేశారు. ఇవాళ మన ప్రభుత్వంలో మీ అందరూ కూడా భాగస్వామ్యం.మీ పదవుల్లో కూర్చోవడానికి నా ద్వారా మీకు ప్రజలు అధికారం ఇచ్చారు.అందరూ కలిసికట్టుగా  పనిచేస్తేనే ప్రజల ఆకాంక్షలకు మనం దగ్గరవుతాం.రాష్ట్రంలో చరిత్రలో ఎప్పుడు జరగని విధంగా 151 ఎమ్మెల్యేలు,22 ఎంపీలను ప్రజలు మనకు ఇచ్చారు. 50 శాతం ఓట్ల శాతం  రావడం చరిత్ర. ప్రజలను ఎప్పడూ కూడా మనం మరిచిపోకూడదు.చ్రరితలో ఎన్నడూ లేని విజయం ప్రజలు అందించారు. మేనిఫెస్టోలో ఉన్న ప్రతి అంశం పూర్తిచేయాలి. ఎన్నికల్లో మేనిఫెస్టోలో ప్రతి అంశం చేశామని ఓట్లు అడగాలి.

ప్రజాస్వామ్యంలో మనం ఉన్నవనే సంగతి ఎవరూ మరిచిపోకూడదు.ఎమ్మెల్యేలు,ప్రజలు మీ దగ్గరకు వచ్చినప్పుడు మీ ముఖంలో చిరునవ్వు ఉండాలి.2 లక్షల మంది ఓటు వేస్తే వారు ఎమ్మెల్యేలు అయిరన్న సంగతి మరిచిపోకూడదు. ఎమ్మెల్యేలు అవీనితి,దోచుకోవడం చేస్తే ఎంతటి పెద్దవారయిన గాని, ఏస్థాయిలో ఉన్న వారినైనా చర్యలు తీసుకుంటాం.ఎమ్మెల్యేలు అవినీతి,అక్రమాలకు దూరంగా ఉండాలి. ప్రజాస్వామ్యంలో ఎమ్మెల్యేలు ఒక కన్ను అయితే రెండో కన్ను అధికారులు. ఇద్దరు ఒక్కటయితే ప్రజలకు మేలు జరుగుతుంది. రైతు,పేద,అట్టడుగు వర్గాలను మరిచిపోకూడదు.శాచునేషన్‌ పద్దతిలో ప్రతి అర్హుడికి అందాలి.వ్యవస్థలో వీరి ఆత్మగౌరవం పెరగాలి.  అణగారిన వర్గాలు ఆర్థికంగాఎదగాలి. మేనిఫెస్టోలో ప్రతి అంశం కూడా పేద,రైతు,అణగారిన వర్గాలకు అందాలి. వారు బాగుపడాలి.

కులం,మతం,ప్రాంతం,రాజకీయాలు,పార్టీలు  చూడకుండా ప్రతి ఒకరికి నవరత్నాలు చేరాలి.మనకు ఓట్లు వేయని వారికి కూడా అర్హత ఉంటే వారికి సంక్షేమం అందాలి.అవినీతి అనేది ఎక్కడ ఉండకూడదు.దేశ మొత్తం మన వైపు చూడాలి.ఇంత బాగా పనిచేస్తుందని మిగిలిన చోట్ల అనుసరించాలి.ప్రజల హక్కుగా అందించాల్సిన సేవలకు లంచాలు ఇచ్చుకోవాల్సిన దుస్థితి రాకూడదు. ప్రజలు ఆఫీసులు చుట్టూ చెప్పులు ఆరిగిపోయేవిధంగా తిరిగే పరిస్థితి రాకూడదు.మన ప్రభుత్వంలో మనం అధికారంలోకి ఉండగా ప్రజలకు ఏమి కావాలన్న కూడా వారు లంచాలు ఇచ్చే పరిస్థితి నుంచి బయటకురావాలి.వారు ఆఫీసులు చుట్టూ చెప్పుడు అరిగే పరిస్థితి రాకూడదు.ఏపీలో ఇసుక మాఫియా ఉండకూడదు.పేకాట క్లబ్బులను ప్రోత్సహించొద్దు.గ్రామస్థాయి నుంచి మార్పు తీసుకురావాలి.కాంట్రాక్టర్లకు అంటేనే అవినీతి అనే పరిస్థితికి తీసుకొచ్చారు.ఇరిగేషన్,రోడ్లు, సచివాలయ నిర్మాణాలు ప్రతి చోట అవీనీతి జరిగింది. పార్శదర్శకంగా మార్పుకోసం పైస్థాయి నుంచి మొదలు పెట్టాం.ఎక్కడా తప్పు జరిగిందనేది గుర్తించాం.

గత ప్రభుత్వ అవినీతికి మచ్చు తునక ఈ ప్రజావేదిక.ఈ అక్రమ నిర్మాణంలో కూర్చోని సమీక్ష జరుపుతున్నాం.ప్రజావేదికను కూల్చేయమని అధికారులకు ఆదేశాలిస్తున్నాం.ప్రజావేదికతోనే అక్రమ కట్టడాల కూల్చివేతలు ప్రారంభమవుతాయి.ఇదే ప్రజావేదికలో ఇదే చివరి సమావేశం.ఓ సీఎం స్థాయిలో ఉండి ఇలాంటి అక్రమ నిర్మాణాలు కడితే కిందన్న వాళ్లు అక్రమాలు చేయకుండా ఉంటారా? అవినీతి ఏ స్థాయిలో ఉందో చెప్పడానికే ప్రజావేదికలో సమావేశం పెట్టాం.అన్ని నిబంధనలకు విరుద్ధంగా ప్రజావేదిక నిర్మించారు.గత ప్రభుత్వ హయాంలో పెన్షన్, బర్త్‌సర్టిఫికెట్,రేషన్‌ కావాలన్న లంచం..జీవిత బీమా కోసం కూడా లంచం తీసుకున్నారు. ప్రతీ సోమవారం అన్ని కార్యాలయల్లో గ్రీవెన్స్‌ డే నిర్వహిస్తాం.స్పందన పేరుతో ప్రజల నుంచి ఫిర్యాదుల స్వీకరిస్తాం.

అధికారులు చిరునవ్వుతో ప్రజల ఫిర్యాదులు స్వీకరించాలి.ఫిర్యాదులు స్వీకరించాక రశీదు ఇవ్వాలి.నిర్ణీత వ్యవధిలో సమస్యలు పరిష్కరించాలి.ప్రతి మూడో శుక్రవారం సిబ్బంది సమస్యలపై దృష్టి సారించాలి.ప్రతివారం ఆకస్మిక తనిఖీలు నిర్వహించాలి.సిహెచ్‌సి,హాస్టళ్లలో నైట్‌హాల్ట్‌ చేయాలి.రాష్ట్రంలో ఇంటిస్థలం లేని వారు ఉండకూడదు.ప్రతి జిల్లాకు ప్రత్యేక వెబ్‌పోర్టల్‌ ఏర్పాటు చేయాలి.వెబ్‌పోర్టల్‌లో అన్ని విభాగాలను అనుసంధానం చేయాలి.ప్రతి ప్రభుత్వ ఆర్డర్‌ దానిలో అందుబాటులో ఉండేలా చూడాలి.ప్రభుత్వ పనుల వివరాలను కూడా వెబ్‌పోర్టల్‌లో ఉంచాలి. ప్రతినెలా మూడో శుక్రవారం చిన్న ఉద్యోగులు,కాంట్రాక్ట్‌ ఉద్యోగుల సమస్యలను వినండి.మీ పరిధిలో ఉంటే వెంటనే పరిష్కరించండి.లేదంటే నా దృష్టికి తీసుకురండి.మనం కలిసి ఆ సమస్యలను పరిష్కరిద్దాం.

print

Post Comment

You May Have Missed