×

ఇప్పుడు అ ఫర్‌  అమ్మఒడి

ఇప్పుడు అ ఫర్‌  అమ్మఒడి

అక్షర క్రమంలోనే కాదు.. అక్షరాస్యతలోనూ ఆంధ్రప్రదేశ్‌ను ముందు నిలబెట్టేందుకు ముఖ్యమంత్రి వైయస్‌ జగన్‌ కృషి చేస్తున్నారని, బుడి బుడి అడుగులు వేసే ప్రతి బిడ్డ బడిలో ఉండాలని అమ్మఒడి పథకాన్ని తీసుకువచ్చారని డిప్యూటీ సీఎం పుష్పశ్రీవాణి అన్నారు. దివంగత మహానేత వైయస్‌ రాజశేఖరరెడ్డి కంటే జగనన్న రెండు అడుగులు ముందుకు వేశారని, జగన్‌ అంటే పేరు కాదు.. జగన్‌ అంటే ఒక బ్రాండ్‌ అని, దానికి ట్యాగ్‌ లైన్‌ చెప్పాడంటే.. చేస్తాడంతే.. అని పుష్పశ్రీవాణి అన్నారు. అసెంబ్లీలో ఆమె మాట్లాడుతూ.. ‘ముఖ్యమంత్రి వైయస్‌ జగన్‌ విప్లవాత్మకమైన ఆలోచనలు చేయగలరో అమ్మఒడి పథకాన్ని చూస్తే అర్థం అవుతుంది. ఈ రాష్ట్రంలో ఒకటి నుంచి ఇంటర్మీడియట్‌ వరకు అమ్మఒడి పథకం అమలు చేస్తున్న దేశంలోనే ఏకైక ముఖ్యమంత్రి వైయస్‌ జగన్‌. తమ బిడ్డలను, జూనియర్‌ కాలేజీలకు పంపే ప్రతి పేద తల్లికి రూ.15 వేలు ఆర్థిక సాయం అందిస్తున్న ప్రభుత్వం ఈ దేశంలో ఏదైనా ఉందంటే అది మన జగనన్న ప్రభుత్వమే.

చిన్నప్పుడు చదువు నేర్పేటప్పుడు ఏ ఫర్‌ యాపిల్‌ అని చెప్పేవారు. కానీ, ఇప్పుడు ఏ ఫర్‌  అమ్మఒడి అని చెప్పే విధంగా ఈ పథకం ఉంది. అ అంటే అమ్మఒడి.. ఆ అంటే ఆంధ్రప్రదేశ్‌ అని అక్షరాలు దిద్దేలా నిలిచిపోయే చారిత్రకమైన పథకం అమ్మఒడి అని గర్వంగా తెలియజేస్తున్నాను. బిడ్డకు అమ్మ పాలు ఎంత శ్రేయస్సుకరమో.. ఈ అమ్మఒడి కూడా అంతే శ్రేయస్కరం అని తెలియజేస్తున్నాను. బుడి బుడి అడుగులు వేసే ప్రతి బిడ్డ బడిలో ఉండాలనే లక్ష్యంతో అమలు చేస్తున్నది ఈ అమ్మఒడి.

print

Post Comment

You May Have Missed