Srisaila Temple: ప్రయోగాత్మక దర్శనాల కల్పన తరువాత 10 వ తేదీ నుంచి భక్తులను శ్రీస్వామిఅమ్మవార్ల దర్శనానికి అనుమతిస్తున్నారు.ముందుగా ఆన్లైన్ ద్వారా రిజిస్ట్రేషన్ చేయించుకున్న భక్తులకు మాత్రమే దర్శనం కల్పిస్తారు.
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి చెందిన భక్తులు దేవస్థానం వెబ్ సైట్ – ‘srisailamonline.com’ ద్వారా నేరుగా దర్శనాల రిజిస్ట్రేషన్ చేయించుకోవచ్చు. ఇతర రాష్ట్రాల భక్తులు దర్శనాల రిజిస్ట్రేషన్ కంటే ముందు తప్పనిసరిగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం నుండి ఇ – పాస్ పొందవలసి వుంటుంది. ఆంద్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వ ‘స్పందన పోర్టల్’ ద్వారా ‘ఇ – పాసు’ పొందవచ్చు. స్పందనపోర్టల్ లో ప్రయాణ ఉద్దేశం తెలియజేసే సందర్భములో ‘పిలిగ్రీమ్ ఆప్షన్’ ద్వారా రాష్ట్రములోకి ప్రవేశించేందుకు ఇ- పాసును పొందే అవకాశం ఉంది. ఇతర రాష్ట్రాల భక్తులు దర్శనానికి ఆన్లైన్ లో రిజిస్ట్రేషన్ చేయించుకునేటప్పుడు విధిగా రాష్ట్ర ప్రభుత్వం ద్వారా పొందిన ఇ- పాసు నెంబరును కూడా తప్పనిసరిగా నమోదు చేయవలసి వుంటుంది.
ఇతర రాష్ట్రాల నుండి వచ్చే భక్తులు ఈ విషయాన్ని గమనించి, దేవస్థానానికి సహకరించవలసినదిగా దేవస్థానం కోరింది .