ఆర్థిక మంత్రి ఈటెల రాజేందర్ అధ్యక్షతన సచివాలయంలో సమావేశం. మంత్రులు మహేందర్ రెడ్డి, జగదీశ్ రెడ్డి చర్చలు. పాల్గొన్న ఆర్టీసీ చైర్మన్ సత్యనారాయణ, రవాణా శాఖ ప్రిన్సిపాల్ సెక్రటరీ సునీల్ శర్మ, ఎండీ రమణారావు, ఆర్ధిక శాఖ ముఖ్య కార్యదర్శి శివశంకర్,ఎంఎల్ఏ శ్రీనివాస్ గౌడ్, గుర్తింపు సంఘం టీఎంయూ ప్రధాన కార్యదర్శి అశ్వథామరెడ్డి, గౌరవ అధ్యక్షుడు థామస్ రెడ్డి.ఆర్టీసీ కార్మికుల వేతన సవరణ , ఇతర డిమాండ్ల మీద చర్చ.ప్రధాన డిమాండ్లు వివరించిన టీఎంయూ నేతలు.19 డిమాండ్స్ తో వినతిపత్రం.సంస్థ స్థితిగతులు, ప్రస్తుత జీత భత్యాల మీద ప్రతినిధులతో చర్చించిన మంత్రులు.సంస్థలో పనిచేస్తున్న వారికి ఉద్యోగ భద్రత కల్పించాలని కోరిన ఉద్యోగులు.ఈ డిమాండ్స్ అన్ని సీఎం కి నివేదిక ఇస్తామన్న మంత్రులు. ఆర్టీసీ కార్మికుల సమస్యలపట్ల సానుకూలంగా స్పందిస్తామన్న మంత్రులు.ఆర్టీసీ కార్మికుల మీద ప్రభుత్వానికి సహానుకూల ప్రతిస్పందన ఉంటుందన్న మంత్రులు.ఆర్టీసీ ఆదాయం పంచే మార్గాల మీద ఎండీతో వాకాబు చేసిన మంత్రులు. ప్రభుత్వం నుంచి రావాల్సిన నిధులు అందించినా సంస్థ కు ఇచ్చినా సంస్థ కూడ ఆదాయం పెంచుకోవాలి.ఈ నెల 15 న కమిటీ రిపోర్ట్ ను సీఎం కు అందిస్తారు .