తాడేపల్లి: ఆన్‌లైన్ కాల్ మనీ వ్యవహారాలపై ముఖ్యమంత్రి వైయస్ జగన్‌మోహన్‌రెడ్డి సీరియస్ అయ్యారు. ఈ వ్యవహారంపై దృష్టి పెట్టాలని ఉన్నతాధికారులను సీఎం ఆదేశించారు. ఆన్‌లైన్ కాల్ మనీ వేధింపులపై కఠిన చర్యలు తీసుకోవాలని సూచించారు. చట్టవ్యతిరేక కార్యకలాపాలు చేస్తున్న వారిపై కఠిన చర్యలు తీసుకోవాలన్నారు. కాల్ మనీ వ్యవహారాలను ఉపేక్షించేది లేదని సీఎం వైయస్ జగన్ స్పష్టం చేశారు.
ఏపీవ్యాప్తంగా స్పెషల్ డ్రైవ్‌లు
మొబైల్ లోన్ యాప్‌లపై ఏపీ వ్యాప్తంగా స్పెషల్ డ్రైవ్‌లు చేపడుతున్నట్లు డీజీపీ గౌతం సవాంగ్ తెలిపారు. మైక్రో ఫైనాన్స్‌పై ప్రత్యేక దృష్టి పెడుతున్నామని పేర్కొన్నారు. మొబైల్ లోన్ యాప్‌లు మహిళల్నే ఎక్కువగా టార్గెట్ చేస్తున్నాయని వెల్లడించారు. మొబైల్ లోన్ యాప్‌లపై కఠిన చర్యలు తీసుకుంటామని డీజీపీ తెలిపారు.