ఆన్లైన్ జర్నలిస్టుల సమస్యలను వెంటనే పరిష్కరించాలి: తెలంగాణ ఆన్లైన్ మీడియా వర్కింగ్ జర్నలిస్ట్స్ అసోసియేషన్ (తొమ్వాజ)

ఆన్లైన్ జర్నలిస్టుల సమస్యలను వెంటనే పరిష్కరించాలి: తెలంగాణ ఆన్లైన్ మీడియా వర్కింగ్ జర్నలిస్ట్స్ అసోసియేషన్ (తొమ్వాజ)

img-20170630-wa0021

ఆన్లైన్ మీడియా జర్నలిస్టుల  సమస్యలను వెంటనే పరిష్కరించాలి: రెండు సంఘాల విలీనం, తెలంగాణ ఆన్లైన్ మీడియా వర్కింగ్ జర్నలిస్ట్స్ అసోసియేషన్ (తొమ్వాజ) ఆవిర్భావం

ఆన్లైన్ మీడియాలో పనిచేస్తున్న జర్నలిస్టుల  సమస్యలను వెంటనే పరిష్కరించాలని  తెలంగాణ  ఆన్ లైన్ మీడియా  వర్కింగ్ జర్నలిస్ట్స్  అసోసియేషన్  ప్రభుత్వాన్ని డిమాండ్ చేసింది. నేడు సోమాజిగూడ ప్రెస్ క్లబ్లో జరిగిన సమావేశంలో తెలంగాణ ఆన్లైన్ మీడియా జర్నలిస్ట్స్ యూనియన్ (తోజు) మరియు తెలంగాణ మీడియా జర్నలిస్ట్స్ అసోసియేషన్ (తోమ్జ) రెండు వీలినమయ్యి తెలంగాణ ఆన్లైన్ మీడియా వర్కింగ్ జర్నలిస్ట్స్ అసోసియేషన్ (తొమ్వాజ) గా ఆవిర్భవించింది.

ఈ సందర్భంగా తొమ్వాజ నూతన కార్యవర్గాన్ని కూడా ఎన్నుకుంది.  యూనియన్  రాష్ట్ర అధ్యక్షుడు  ఆయిలు  రమేష్  మాట్లాడుతూ   ప్రింట్ అండ్  ఎలక్ట్రానిక్ మీడియా కంటే  అత్యంత  వేగంగా సమాచారాన్ని చేరవేస్తూ ప్రజలకు  చేరువవుతున్న ఆన్  లైన్ మీడియా కు  తెలంగాణ ప్రభుత్వం తగిన గుర్తింపు ఇవ్వాలని  కోరారు. ఇతర మీడియాల్లో పనిచేస్తున్న జర్నలిస్టులకు  ఇస్తున్నట్లు గానే  ఆన్ లైన్ మీడియాలో పని చేస్తున్న జర్నలిస్టు లకు  అక్రిడిటేషణ్ కార్డులను ఇవ్వాలని  అన్నారు.   ఇందుకు గాను  ఆన్ లైన్ మీడియా ను గుర్తించేందుకు  తగిన  గైడ్ లైన్స్  ను  రూపొందిం చాలని  ఆయన ప్రభుత్వానికి సూచించారు .

యూనియన్  ప్రధాన  కార్యదర్శి  శ్రీధర్ ధర్మాసనం మాట్లాడుతూ ఇప్పటికే  రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్ర శేఖర్ రావును కలిసి  ఆన్ లైన్ మీడియా జర్నలిస్టులకు గుర్తింపు ఇవ్వాలని విజ్ఞప్తి చేశామని  కాని సరయిన స్పందన లేదని  ఆయన  వివరించారు. అయిన మరొక్కసారి ముఖ్యమంత్రి గారిని కలిసి ఈమేరకు విజ్ఞ్యప్తి చేస్తామని అప్పటికి కాని పక్షంలో పోరుబాటని ఆశ్రయిస్తామన్నారు. గతంలో ఇచ్చిన అక్రిడిటేషణ్ కార్డులను ఎందుకు ఆపివేసారని అధికారులని అడుగుతే అసంబద్ద కారణాలు చూపుతున్నారని  ఆరోపించారు.  ఇప్పటికే  కేంద్ర ప్రభుత్వం ఆన్ లైన్ మీడియాను గుర్తిస్తూ  కొన్ని గైడ్ లైన్స్ ను రూపొందించిందని శ్రీధర్ చప్పారు .  గత సంవత్సరం ఈ గైడ్ లైన్స్ ప్రకారం అక్రిడిటేషణ్లు  ఇచ్చిన ప్రభుత్వం ఈ  సారి మాత్రం ఇచ్చిన జీవో  లో  ఆన్లైన్  మీడియాను  చేర్చకపోవడం శోచనీయం అని పేర్కొన్నారు.

యూనియన్ గౌరవధ్యక్షులైన కాసుల ప్రతాప్ రెడ్డి మాట్లాడుతూ చాలామంది ప్రభుత్వ అధికారులు ఆన్లైన్ మీడియా ని సోషల్ మీడియా గా భావిస్తుండడం ఆశ్చర్యం కలిగిస్తుందని. ఆన్లైన్ మీడియా ప్రింట్, ఎలక్ట్రానిక్ మీడియా తరువాత మూడవ మాధ్యమంగా నేడు ఆవిర్భవించిందని తెలిపారు. గతంలో ఇచ్చిన అక్రిడిటేషణ్ కార్డులను ఈ సంవత్సరం రద్దు చేయడం వెనకాల ఎదో రాజకీయ కుట్ర ఉందని. చిన్న పత్రికల విషయంలో ప్రభుత్వం అనుసరిస్తున్న పాలసీ నే ఆన్లైన్ మీడియా కూడా వర్తింప చేయమని గతంలోనే కోరామని తెలిపారు.

నూతనంగా ఎన్నుకోబడ్డ ఇతర కమిటీ సభ్యులైన  (వైస్ ప్రెసిడెంట్స్) మదిశెట్టి రాజగోపాల్,ఎ రాజేష్, సూర్య రావ్, ఎం ఎస్ శంకర్, అమర్ రాజ్పుటే, కే. శ్రీకాంత్ రెడ్డి (జాయింట్ సేక్రేటరీలు) కళ్యాణం శ్రీనివాస్, కే.హనుమంత్ రావు, ముద్దం నరసింహ స్వామి, రాజ్కుమార్ అల్లా, శ్యాం మోహన్, ప్రభు దాస్, (కోశాధికారి) వేముల సదానందం మరియు కార్యవర్గ సభ్యులు కే ఎల్ నరసింహ రావు, ఎస్ శంకర్ గౌడ్, శైలజ రాజ్పుటే, డి సింధూర, కే. సంతోష్ కుమార్, ఫణి ముళ్ళపూడి, డాక్టర్ రామ్ మూర్తి హాజరైనారు.

print

By Online News Diary

ONLINENEWSDIARY.COM - A Multilingual Online News Portal

Leave a Reply

Your email address will not be published.