హైదరాబాద్,జూలై 22: ఆధ్యాత్మిక రాజధాని యాదాద్రికి ఐఎస్వో సర్టిఫికేట్ రావడం అద్బుత కళా సంపదకు దక్కిన అరుదైన గౌరవమని గృహ నిర్మాణ,న్యాయ, దేవాదాయ శాఖ మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి అభివర్ణించారు. ఐఎస్వో సర్టిఫికేట్ రావడం పట్ల హర్షం వ్యక్తం చేశారు. ముఖ్యమంత్రి చంద్రశేఖర్‌రావు దేవాలయ నిర్మాణంపై ప్రత్యేక దృష్టి, నిరంతర పర్యవేక్షణ, ఆయన ప్రోత్సాహం వల్లే యాదాద్రికి ఐఎస్వో సర్టిఫికేట్ లభించిందన్నారు. సీఎంకి కృతజ్ఞతలు తెలిపిన మంత్రి… వైటీడిఏ అధికారులు, స్థపతులు, అర్కిటెక్ట్ లు, శిల్ప కళాకారులకు అభినందనలు తెలియజేశారు. నిర్మాణ దశలోనే ఐఎస్వో (ఇంటర్‌నేషనల్ ఆర్గనైజేషన్ ఫర్ స్టాండైర్డెజేషన్) సర్టిఫికేట్ దక్కడంతో యాదాద్రి కీర్తి మరింత పెరిగిందన్నారు. ప్రాచీన శిల్పకళా సౌందర్యం.. కృష్ణశిలల నిర్మాణాలు.. ఎత్తయిన గోపురాలు.. అద్భుతమైన కళాసంపద.. తంజావూరు శిల్ప నిర్మాణ రీతి.. ప్రాకారాల సౌందర్య ప్రగతి.. శిల్పుల కళాసృష్టితో రూపుదిద్దుకుంటున్న యాదాద్రి ప్రపంచస్థాయి ఆధ్యాత్మిక క్షేత్రంగా నిలుస్తుందన్నారు. print Post navigation కమలానగర్ శ్రీ షిరిడి సాయి సన్నిధిలో 27 న గురు పౌర్ణమి BACHI CARTOON