ఆదివారం శిల్పారామం ఎథినిక్ హాల్లో శ్రీమతి స్మితా మాధవ్ గారి ఆధ్వర్యంలో వర్ణా ఆర్ట్స్ అకాడమి వారి శిష్య బృందంచే “Almighty Trinity” – A Group of Bharatanatyam Dance.
సర్వం బ్రహ్మమయం, నారాయణుడు, శివుడు, సంగీతదేవతలు, నారదుడు, త్రినేత్రుడి శివతాండవం, మోహినీ భస్మాసుర, వర్ణం, థిల్లాన ప్రదర్శించి మెప్పించారు. చిత్రవీణ యెన్.రవి కిరణ్ గారు సంగీతం సమకూర్చారు.
శ్రీమతి స్మితామాధవ్, భార్గవి, నాగ శ్రీనివాస్, నందిత, మేఘ, అనిందిత, ప్రణతి, ఝాన్సి, హరిత, రామారావు, అనూష మొదలైనవారు ప్రదర్శించారు.
ప్రదర్శించిన కళాకారులందరికి బహుమతి ప్రదానం చేశారు. శ్రీ హరీష్ చంద్ర ప్రసాద్, ఫౌండర్ మరియు చీఫ్ మెంటర్, మహలక్ష్మి గ్రూప్ వారు విచ్చేసి కళాకారులను అభినందించారు.