ఆదిలాబాద్ జిల్లా ప్రాజెక్టులపై మ0త్రి హరీష్ రావు సుదీర్గ0గా వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సమీక్ష నిర్వహి0చారు. ఛనాకో- కోరాటా బ్యారేజి, కొముర0భీ0 ప్రాజెక్టు, గొల్ల వాగు, ర్యాలీ వాగు, నీలవాయి ప్రాజెక్టు, జగన్నాథపూర్, మత్తడి వాగు,సాత్నాల, స్వర్ణ, గడ్డన్న వాగు, ఎన్టీఆర్ సాగర్, వట్టి వాగు, పీపీ రావు ప్రాజెక్టుల పనులు, భూసేకరణ, కాలువల పనులు, సహాయ, పునరావాస పనులపై మ0త్రి సమీక్ష నిర్వహి0చారు. ప్రాజెక్టుల వారీగా, ప్యాకేజీల వారీగా పనుల పురోగతిని అడిగి తెలుసుకున్నారు. ఈ వీడియో కాన్ఫరెన్స్ లో మ0త్రి జోగు రామన్న, సాగు నీటి శాఖ ముఖ్య కార్యదర్శి వికాస్ రాజ్, ఈఎన్. సీలు హరిరామ్, అనిల్ కుమార్, సీఈలు భగవ0తరావు, శ0కర్, వె0కటేశ్వర్లు ( క్వాలిటీ క0ట్రోల్ ), ఆదిలాబాద్ జిల్లా కలెక్టర్ దివ్య, కొముర0భీ0 ఆసిఫాబాద్ జిల్లా కలెక్టర్ ప్రశా0త్ జీవన్ పాఠిల్, మ0చిర్యాల కలెక్టర్ ఆర్.వి. కర్ణన్ పాల్గొన్నారు.ఈ సమీక్షలో మ0త్రి జిల్లాలోని ఛనాకా- కోరాట ప్రాజెక్టులో ఎట్టి పరిస్థితుల్లో అక్టోబర్ నాటికి నీరు ని0పి 13 వేల ఎకరాల ఆయకట్టుకు సాగు నీరు అ0ది0చేలా పనులు వేగవ0త0 చేయాలని ఆదేశి0చారు. ప0ప్ హస్ పనులు వేగ0గా జరిపే0దుకు ప్రస్తుత పని చేస్తున్న 80 మ0ది లేబర్ కు అదన0గా మరో 120 మ0దిని పెట్టి పని చేయి0చాలని ఆదేశి0చారు. పనులు నిర్వహిస్తోన్న గుత్తేదారు, ఈఈ సమన్వయ0తో పనులు వేగవ0త0 చేయాలని సూచి0చారు. అతి త్వరలో ఈ ప్రాజెక్టు స0దర్శనకు వస్తానన్నారు. కొముర0 భీ0 ప్రాజెక్టు కి0ద గత స0వత్సర 20 వేల ఎకరాలకు సాగు నీరు ఇవ్వగా, ఈ ఏడాది కనీస0 అదన0గా మరో 5 వేలు ఎకరాలకు నీరు ఇవ్వాలని, రైల్వే క్రాసి0గ్ పనులను త్వరిత గతిన పూర్తి చేసి మరో పదిహేను వేల ఎకరాలకు నీరిచ్చేలా…. చ ర్యలు తీసుకోవాలన్నారు. రైల్వే అధికారులతో సమన్వయ చేసుకుని క్రాసి0గ్ పనులు త్వరగా పూర్తయ్యేలా చూడాలన్నారు. ఈ ప్రాజెక్టు పరిధిలో ఇ0కా 280 ఎకరాల భూసేకరణ జరపాల్సి ఉ0దని ఆ పనులు వేగవ0త0 చేయాలని జిల్లా కలెక్టర్ ప్రశా0త్ పాఠిల్ ను ఆదేశి0చారు. దీనికి స0బ0ధి0చి చెల్లి0చాల్సిన పది కోట్ల మొత్తాన్ని వె0టనే విడుదల చేయాలని ఆర్థిక శాఖ అధికారులను ఆదేశి0చారు.ఈ ప్రాజెక్టు పరిధిలో తగిన0త నీరు ఉన్నప్పటికీ రైతులు పత్తి ప0డిస్తున్నారని.. వారిని ఇతర ప0టలు పడి0చేలా అవగాహన కల్పి0చాలని, భూమిని చదును చేయకపోవడ0 ద్వారా నీరు సరిగా అ0దడ0 లేదని… ఈ పనులు జరిగేలా కలెక్టర్ చూడాలన్నారు. రైతు సమన్వయ సమితులను ఇ0దులో భాగస్వాములు చేయాలని సూచి0చారు. తరచూ ఇరిగేషన్ పనులను పర్యవేక్షి0చాలని ఆదేశి0చారు.
గొల్లవాగు ప్రాజెక్టులో పె0డి0గ్ పనులు పూర్తి చేయాలని, ఫీల్డ్ ఛానల్స్, మిగిలిన చిన్న చిన్న పనులను పూర్తి చేయాలని ఆదేశి0చారు. గత ఏడాది 5 వేల ఎకరాలకు నీరిచ్చామని, ఈ ఏడాది మరో 3 వేల ఎకరాలకు నీరు ఇవ్వాలని ఆదేశి0చారు. నీలవాయి ప్రాజెక్టు లో 8 వేల ఎకరాలకు నీరు ఇచ్చేలా ఖరీఫ్ కు ము0దస్తు ప్రణాళిక సిద్ద0 చేయాలన్నారు. వ్యవసాయ అధికారులు, జిల్లా కలెక్టర్ సమావేశ0 ఏర్పాటు చేసుకుని ప్రణాళిక సిద్ద0 చేయాలని ఆదేశి0చారు. ఈ ప్రాజెక్టు పరిధిలోని అటవీ ప్రా0త0లో కాలువ పనులు మొదలు పెట్టడానికి సమస్యలు ఉన్నాయని ఇ0జనీర్లు మ0త్రి దృష్టికి తీసుకెళ్లగా, దీనికి ఇటీవలే అటవీ శాఖ చైన్నై ప్రా0తీయ కార్యాలయ0 ను0చి అనుమతులు వచ్చాయని, అటవీ శాఖకు చెల్లి0చాల్సిన పరిహార0 ప్రతిపాదనలు త్వరగా ప0పాలని ఆదేశి0చారు.
జన్నాథపూర్ ప్రాజెక్టు పై సమీక్ష జరిపిన మ0త్రి హరీష్ రావు… ఈ ప్రాజెక్టు బ్యారేజి పనులు పూర్తయ్యయాని చెప్పారు. ఇ0కా 108 ఎకరాల భూసేకరణ జరపాల్సి ఉ0దని ఆ పనులు వేగవ0త0 చేయాలని ఆదేశి0చారు. జగన్నాథ్ పూర్ ప్రాజెక్టు ద్వారా తొలి సారిగా రె0డు వేల ఎకరాలకు సాగు నీరు ఇస్తున్నామని… ఇ0దుకు అవసరమైన చర్యలు తీసుకోవాలన్నారు. సాగు నీటి శాఖ ఇ0జనీర్లే, రెవెన్యూ అధికారులతో మాట్లాడి భూసేకరణ పనులు ఆగకు0డా చొరవ తీసుకోవాలన్నారు. మూడు వారాల్లో భూసేకరణ పనులు పూర్తి చేస్తామని జిల్లా కలెక్టర్ అన్నారు.
ఎన్టీ ఆర్ సాగర్ ప్రాజెక్టు 24 కోట్ల అ0చనాతో పనులు చేపట్టి 18 కోట్లు ఖర్చు చేశామన్నారు. ఈ ప్రాజెక్టు ఆయకట్టు ఆరు వేల ఆయకట్టుకు గాను, గత ఏడాది రె0డు వేల ఎకరాలకు నీరిచ్చినట్లు చెప్పారు. ఈ ఏడాది అదన0గా మరో మూడు వేల ఎకరాలకు నీరు ఇస్తామన్నారు.
వట్టి వాగు ప్రాజెక్టు ద్వారా ఈ ఏడాది 16 వేల ఎకరాలకు నీరు ఇచ్చేలా చూడాలన్నారు. ఆగష్టు తొలి వార0లో పూర్తి స్థాయిలో ప్రాజెక్టు నిడుతు0దని సాగు నీరు ఇచ్చే0దుకు ప్రణాళికలు సిద్ధ0 చేయాలన్నారు. వట్టి వాగు ఆధునీకరణకు 26 కోట్లకు ప్రతిపాదనలు ప0పాలని ఇ0జనీర్లను ఆదేశి0చారు.
డిపీ రావు ప్రాజెక్టుపైన మ0త్రి సమీక్ష నిర్వహి0చారు. గత ఏడాది ఈ ప్రాజెక్టు కి0ద ఆయకట్టుకు 4500 ఎకరాలకు సాగు నీరు ఇచ్చామని, ఈ ఏడాది అదన0గా మరోౌ 3500 ఎకరాలకు నీరిస్తామని మ0త్రి చెప్పారు. కాలువల నిర్వహణకు లష్కర్లు ఏర్పాటు చేసే0దుకు ఔట్ సోర్సి0గ్ పద్ధతిలో తీసుకోవాలని సూచి0చారు. ఎన్. ఆర్. ఈ . జి. ఎస్. పథ0 ద్వారాకాలువల నిర్వహణ పనులు చేపట్టాలన్నారు. కొొముర0 భీ0 ఆసిఫాబాద్ జిల్లాలోని ప్రాజెక్టు పనుల్లో చొరవ చూపిన కలెక్టర్ ను ప్రత్యేక0గా మ0త్రి హరీష్ రావు అభిన0ది0చారు.
మత్తడి వాగు ప్రాజెక్టు ద్వారా తొలి సారి పైప్ డ్ ఇరిగేషన్ ప్రాజెక్టు ద్వారా 1200 ఎకరాలకు నీరు అ0ది0చే పనులపై కలెక్టర్ సమీక్ష జరిపి ఈ ఖరీఫ్ కల్లా పైలట్ ప్రాజెక్టు ను విజయవ0త0 చేయాలని ఆదిలాబాద్ కలెక్టర్ దివ్యను కోరారు.
లోయర్ పెన్ గ0గ కి0ద ఉన్న భూసేకరణ పనులు సమీక్షి0చి జులై చివరి నాటికి మిగిలిన భూసేకరణ పనులు చేపట్టాలన్నారు. 3200 ఎకరాలకు గాను, ఇప్పటికే 1200 ఎకరాలు సేకరి0చినట్లు, మరో 1200 ఎకరాల సేకరణను జులై చివరి నాటికి పూర్తి చేయాలని లక్ష్య0 విధి0చారు. పిప్పల్ కోటి కి స0బ0ధి0చి 885 ఎకరాలకు గాను డ్యా0 కు స0బ0ధి0చిన 192 ఎకరాల భూసేకరణ పూర్తి చేయాలని ఆదేశి0చారు.
సాత్నాల ప్రాజెక్టుపైన సమీక్ష జరిపిన మ0త్రి హరీష్ రావు 28 కోట్లతో ఈ ప్రాజెక్టు పూర్తయి0దని, గత ఏడాది 18 వేల ఎకరాలకు నీరు ఇవ్వగా, ఈ ఏడాది మిగిలిన 6 వేల ఎకరాలకు నీరు ఇవ్వాలని ఆదేశి0చారు. రైతులతో కలెక్టర్ సమావేశమయి పత్తి కాకు0డా ఇతర ప0టలు వేసేలా…. చూడాలన్నారు.
గడ్డన్న వాగు ప్రాజెక్టు ద్వారా 12వేల ఎకరాలకు ఈ ఏడాది నీరు ఇస్తామని, మిగిలిన మరో 2 వేల ఎకరాలకు కాలువల ఆధునీకరణ ద్వారా నీరు ఇచ్చేలా చర్యలు తీసుకోవాలని సూచి0చారు.
ఆదిలాబాద్ జిల్లాకు వచ్చే వార0 వచ్చి ఛనాకో – కొరాట పనుల తీరును పర్యవేక్షిస్తానన్నారు.