ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి కొత్త గవర్నర్ గా విశ్వభూషణ్ హరిచందన్ నియమితులయ్యారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి డిసెంబర్ 2009లో ఈఎస్ఎల్ నరసింహన్ గవర్నర్ గా నియమితులయ్యారు . 2014లో రాష్ట్రం విడిపోయిన తర్వాత రెండు రాష్ట్రాలకు నరసింహన్ గవర్నర్ గా కొనసాగారు. తాజాగా ఆంధ్రప్రదేశ్ కు కొత్త గవర్నర్ ను కేంద్రం నియమించింది.