తాడేపల్లి : ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైయస్ జగన్‌మోహన్‌రెడ్డి మరో ప్రతిష్టాత్మక పథకానికి శ్రీకారం చుట్టారు. మంగళవారం ‘జగనన్న విద్యా దీవెన’ పథకాన్ని సీఎం వైయస్ జగన్ ప్రారంభించారు. వివిధ జిల్లాల విద్యార్థులతో సీఎం వైయస్ జగన్ వీడియో కాన్ఫరెన్స్‌లో మాట్లాడారు. ఫీజు రీయింబర్స్‌మెంట్ కింద రూ. 4 వేల కోట్లు విడుదల చేశారు.