శ్రీ అహోబిలం లక్ష్మీ నరసింహస్వామి దేవస్థానంలో
శ్రీ గోదాదేవి సన్నిధి జీర్ణోద్ధరణ , సంప్రోక్షణలో భాగంగా శనివారం ఉదయం నిత్యారాధన, తరువాత ప్రాణ ప్రతిష్ట జరిగింది . అనంతరం మహపూర్ణాహుతి జరిపి మహాకుంభ కలశ జలములతో విమానమునకు, గోదాదేవి మూలబింబమునకు ఉత్సవ మూర్తికి సంప్రోక్షణ చేశారు. శ్రీ ప్రహ్లాదవరద స్వామి వారు ఉభయ దేవేరులతో గోదాదేవి సన్నిధికి వేంచేశారు. అనంతరం శాత్తుమోరై, గోష్టి కార్యక్రమాలు జరిగాయి. సాయంత్రం శ్రీ గోదాదేవి అమ్మవారితో శ్రీ ప్రహ్లాదవరద స్వామి వారికి తిరువీధి ఉత్సవం నిర్వహించారు. – courtesy: Kidambi sethu ramanAND6