×

అహోబిలంలో మహాభాగ్యం ఉత్తర ద్వార దర్శనం courtesy; kidambi sethu raman

అహోబిలంలో మహాభాగ్యం ఉత్తర ద్వార దర్శనం courtesy; kidambi sethu raman

Special Report from kidambi sethu raman  :

Vaikunta ekaadashi festival :

Sri Ahobila Math Paramparaadhrena Sri Adivan Satagopa Yatheendra Mahadesika Sri Lakshmi Narasimha Swamy Devasthaanam, Ahobilam.

 Today we are blessed to be in Ahobilam.sri Adivan satagopa yatheendra mahadesika swamy ,who received tridandam and sanyaasam from the lotus hands of sri Ahobaleshwara,first entered through Uttara dwaram .We followed swamy . He placed us at the lotus feets of sri Prahladhavarada.

What Annamacharya says about sri Adivan satagopa yatheendra mahadesika swamy in his keerthana
“choodudindariki sulabhudu hari thodu needayagu doramuni ithadu” is exactly right.

Sri madAadivan satagopa yatheendra mahadesikaya namah

శ్రీ అహోబిల మఠం పరంపరాధీన
శ్రీ మదాదివణ్ శఠగోప యతీంద్ర మహాదేశిక
శ్రీ లక్ష్మీ నరసింహ స్వామి దేవస్థానం, అహోబిలం

వైకుంఠ ఏకాదశి ఉత్సవం:

శుక్రవారం  అహోబిల వాసులమందరము భాగ్యం చేసుకున్నాము.సాక్షాత్తు అహోబిలేశ్వరులచే కాషాయ త్రిదండములు పొందిన శ్రీ ఆదివన్ శఠగోప యతీంద్ర మహాదేశికులు తాను మొదట ఉత్తరద్వారం ద్వారా ప్రవేశించి,తన వెంట మా అందరిని తీసుకొని వెళ్లి శ్రీ ప్రహ్లాదవరదులను దర్శింపచేసారు.

అన్నమయ్య శ్రీ ఆదివన్ శఠగోప యతీంద్రుల పై రచించిన “చూడుడిందరికి సులభుడు హరి తోడు నీడయగు దొరముని ఇతడు ” అనే కీర్తన మా హృదయములో మార్మోగినది.

ఇదియే శరణాగతి తత్వం

ఇది గాక సౌభాగ్యము,ఇది గాక తపము మరి ఇదిగాక వైభవం ఇంకొకటి గలదా!!!! వివరాలు :

శ్రీ అహోబలేశ్వరుల శ్రీ సన్నిధిలో శుక్రవారం  వైకుంఠ ఏకాదశి సందర్భాంగా తెల్లవారు జామున 2.00 గంటలనుండే పూజలు ప్రారంభమయ్యాయి.మొదట విశ్వరూపం ,తిరువారాధన ,సహస్రనామార్చన జరిగాయి.తదుపరి తిరుప్పావై సేవకాలం , శాత్తుమోరై జరిగాయి.4.00 గంటల నుంచి  ఉత్తరద్వారా దర్శనం కల్పించారు.ఆలయ ఆనవాయితీ ప్రకారం మొదట అహోబిల మఠం స్థాపనాచార్యులైన ఆదివన్ శఠగోప యతీంద్ర మహాదేశికులవారికి ఉత్తర ద్వార దర్శనం కల్పించి గౌరవ బహుమానాలు అందించారు.అనంతరం ప్రస్తుత 46 వ పీఠాధిపతి వారి ముద్రకర్తకు ఆలయ మర్యాదలు అందించారు.తదనంతరం భక్తులందరికి ఉత్తర ద్వార దర్శనం కల్పించారు.

శ్రీమదాదివణ్ శఠగోప యతీంద్ర మహాదేశికాయ నమః

print

Post Comment

You May Have Missed