అసాధారణ పరిస్థితుల్లో ఆర్డినెన్స్‌లు మామూలే-అంబటి రాంబాబు
తాడేపల్లి: అసాధారణ పరిస్థితుల్లో ఆర్డినెన్స్‌లు తీసుకురావడం మామూలేనని, ఎన్నికల కమిషనర్ పదవీ కాలాన్ని ఐదేళ్ల నుంచి మూడేళ్లకు కుదించామని వైయస్‌ఆర్‌సీపీ అధికార ప్రతినిధి, ఎమ్మెల్యే అంబటి రాంబాబు పేర్కొన్నారు. పదవీ కాలం కుదించడం వల్ల ఇప్పుడుఉన్న వారు పోతారు..కొత్త వాళ్లు వస్తారన్నారు. వ్యక్తులను టార్గెట్ చేసి ఈ నిర్ణయాలు తీసుకోలేదన్నారు. ఎన్నికల సంస్కరణలతో పటిష్టమైన వ్యవస్థను ఏర్పాటు చేయడమే ప్రభుత్వ లక్ష్యమన్నారు. శుక్రవారం తాడేపల్లిలోని వైయస్‌ఆర్‌సీపీ కేంద్ర కార్యాలయంలో అంబటి రాంబాబు మీడియాతో మాట్లాడారు.
Post Comment