అసాంఘిక  వ్యసనాలను ప్రోత్సహించరాదు- ఐజి  షేక్ మహమ్మద్ ఇక్భాల్

కర్నూలు: యూనిఫాం ధరించిన ప్రతి ఒక్కరూ ప్రజోపయోగ పనులు చేస్తూ అంత:కరణ శుధ్దితో పని చేయాలని రాయలసీమ రేంజ్ ఐజి  షేక్ మహమ్మద్ ఇక్భాల్  అన్నారు. జీవితంలో నిబద్దత తో పని చేయడమే ఉత్తమమైన ధర్మమన్నారు. పోలీసుగా మరణం పొందితే త్రివర్ణపతాకం, గ్రామం, తల్లిదండ్రులు , స్నేహితులు , పది మంది గర్వపడేలా ఉండాలన్నారు.
ఐజి గా పదవీ విరమణ పొంది వెళుతున్న ఈ అధికారికి  జిల్లా పోలీసు కార్యాలయంలోని వ్యాస్ ఆడిటోరియంలో డిటిసిలో శిక్షణ పొందుతున్న ట్రైనిలతో  ఆత్మీయ సమావేశం ఏర్పాటు చేశారు.

ఈ కార్యక్రమంలో జిల్లా ఎస్పీ  గోపినాథ్ జెట్టి, అడిషనల్ ఎస్పీలు పి. షేక్షావళి, డిఎస్పీలు డిటిసి వైస్ ప్రిన్సిపల్ ,  ఖాదర్ భాషా,  రమేష్ రెడ్డి, సిఐలుసుబ్రమణ్యం, పవన్ కిషోర్,  రామయ్యనాయుడు,  మురళీధర్ రెడ్డి, డిటిసి ఆర్ ఐ లు  శివారెడ్డి, ఆర్ ఎస్సైలు , ఎస్సైమంజునాథ్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.

print

Post Comment

You May Have Missed