గుంటూరు: వైయస్‌ఆర్ ఆరోగ్య ఆసరా పథకాన్ని ముఖ్యమంత్రి వైయస్ జగన్‌మోహన్‌రెడ్డి ప్రారంభించారు. గుంటూరు ప్రభుత్వ ఆస్పత్రిని సందర్శించిన సీఎం వైయస్ జగన్ అక్కడ చికిత్స పొందుతున్న రోగులను పరామర్శించారు. అమ్మా.. ఆరోగ్యం ఎలా ఉందమ్మా..? డాక్టర్లు మెరుగైన సేవలు అందిస్తున్నారా..? అంటూ రోగులను ఆప్యాయంగా పలకరించారు. అనంతరం ఆ రోగులకు వైయస్‌ఆర్ ఆరోగ్య ఆసరా పథకం కింద చెక్కులు పంపిణీ చేశారు. ఆరోగ్యశ్రీ కింద శస్త్ర చికిత్స అనంతరం విశ్రాంతి కావాలానికి రోజుకు రూ. 225 చొప్పున లేదా గరిష్టంగా నెలకు రూ. 5 వేల చొప్పున ఆస్పత్రి నుంచి డిశ్చార్చి అయిన 48 గంటల్లో ఆర్థికసాయం అందిస్తారు. మొత్తం 26 విభాగాల్లో 836 శస్త్ర చికిత్సలకు ఆర్థిక సాయం వర్తిస్తుంది.