న్యూయార్క్ : అమెరికాలో జరుగుతున్న ‘సుస్థిర అభివృద్ధి ప్రభావ సదస్సు (సస్టెయినబుల్ డెవలప్‌మెంట్ ఇంపాక్ట్ సమ్మిట్)లో పాల్గొన్న ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు.
‘సుస్థిర ఉత్పాదకత శీఘ్ర సాధన’ అనే అంశంపై ఏపీఈడీబీ (ఆంధ్రప్రదేశ్ ఆర్థికాభివృద్ధి మండలి)తో కలిసి ప్రపంచ ఆర్థిక వేదిక (WEF) సంయుక్త పత్రం విడుదల.
‘సుస్థిర ఉత్పాదకత శీఘ్ర సాధన’ పేరుతో వెలువరించిన ఈ పత్రంలో ఆంధ్రప్రదేశ్‌లో పారిశ్రామిక సానుకూల అంశాలపై 28 పేజీలతో వివరణాత్మక శ్వేత పత్ర నివేదిక
ఆటోమోటీవ్, ఎలక్ర్టానిక్ పరిశ్రమలకు సంబంధించి ఏటా 5 యుఎస్ బిలియన్ డాలర్ల మేర అవకాశాలు వున్నాయని తొలిపేజీలో ప్రముఖంగా పేర్కొన్న WEF.
తొలి ఛాప్టర్‌లో భారతదేశంలో పారిశ్రామిక ముఖచిత్రం, రెండో ఛాప్టర్‌లో ‘సుస్థిర ఉత్పాదకతను పెంపొందించడానికి దోహదపడే నాలుగో పారిశ్రామిక విప్లవ సాంకేతికత’ మూడవ ఛాప్టర్‌లో సుస్థిర ఉత్పాదకత విలువ’, నాలుగో ఛాప్టర్‌లో ‘సుస్థిర ఉత్పాదకతకు మార్గం’ మొదలైన శీర్షికలతో వివరణాత్మక అంశాలు.
శ్వేతపత్రంలో ‘వరల్డ్ ఎకనామిక్ ఫోరం’ ఎగ్జిక్యూటీవ్ కమిటీ మెంబర్ హెలెనా లారెంట్, ఏపీఈడీబీ సీఈవో జాస్తి కృష్ణకిశోర్ తొలిపలుకులు
ఏపీలోని నెల్లూరు, చిత్తూరు, అనంతపురము జిల్లాలు ఆటో హబ్‌గా రూపొందుతున్నట్టుగా సంయుక్త శ్వేతపత్రంలో వెల్లడి.
అనంతపురములో కియా మోటార్స్, చిత్తూరులో ఇసుజు, హీరో మోటో కార్ప్, అమరరాజా గ్రూప్, అపోలో టైర్స్, ఆటో కాంపొనెంట్ తయారీ యూనిట్లు, నెల్లూరులో భారత్ ఫోర్జ్, కృష్ణా జిల్లాలో అశోక్ లేల్యాండ్ తదితర ఆటో మొబైల్ రంగ దిగ్గజాలు వేళ్లూనుకున్న వైనాన్ని తెలియపరచిన సంయుక్త పత్రం.
శ్రీసిటీ, తిరుపతి, కాకినాడ, విశాఖ, అనంతపురము, అమరావతిలలో ఎలక్ట్రానిక్ మాన్యుఫాక్చరింగ్ క్లష్టర్ల అభివృద్ధి ప్రక్రియ వేగవంతంగా జరుగుతున్నట్టు సంయుక్తపత్రంలో వివరణ.
ఒక రాష్ట్రంలో పారిశ్రామిక అభివృద్ధి, పెట్టుబడి అవకాశాల గురించి వరల్డ్ ఎకనామిక్ ఫోరం ఈ తరహా శ్వేతపత్రం విడుదల చేయడం విశేషమని పేర్కొంటున్న వాణిజ్య వర్గాలు.