న్యూయార్క్ : అమెరికాలో తొలిరోజు ముఖ్యమంత్రి చంద్రబాబు బిజీ షెడ్యూల్ *తొలుత ముఖ్యమంత్రితో రేడియేషన్ ఆంకాలజిస్ట్ డాక్టర్ నోరి దత్తాత్ర్రేయుడు భేటీ*అమెరికాలో సుప్రసిద్ధ భారతీయ వైద్యుడిగా పేరొందిన పద్మశ్రీ నోరి దత్తాత్రేయుడు.*అక్కడి తన ‘సెంటర్ ఫర్ ఎక్స్లలెన్స్’ ద్వారా ఏపీలోని ఫిజిషియన్లకు అవసరమైన తర్ఫీదునిచ్చేందుకు అంగీకారం.*సొంతరాష్ట్రంలో వైద్యసేవలకు అవసరమైన ఐవోటీ సాధనాలను అందించడంలో సహకరించాలని కోరిన ముఖ్యమంత్రి చంద్రబాబు.*వైజ్ఞానిక అంశాలే రాబోయే కాలాన్ని నడిపించే చోదకశక్తిగా వుంటాయని, ముఖ్యంగా వైద్యరంగంలో ‘ఇంటర్నెట్ ఆఫ్ థింగ్స్’ సాధనాలు అత్యంత అవసరాలుగా నిలుస్తాయని పేర్కొన్న ముఖ్యమంత్రి చంద్రబాబు.*కేన్సర్ చికిత్స విధానాల్లో నూతన సాంకేతిక ఆవిష్కరణల విస్తృతికి తోడ్పడాలని సూచన.*సొంత రాష్ట్రానికి వచ్చే పారిశ్రామికవేత్తలకు ప్రభుత్వం వెన్నుదన్నుగా వుంటుందని హామీ.*విజ్ఞానం, సాంకేతికత ఊతంగా అమెరికాలో తెలుగువారి తలసరి ఆదాయం మరో ఐదేళ్లలో రెండింతలు కానున్నదని సీయం వ్యాఖ్య.*ఏపీని ఇన్నోవేషన్ వ్యాలీగా తీర్చిదిద్దే కృషి ఆరంభమైందని, అంతిమంగా సాధారణ ప్రజల జీవన విధానాన్ని మెరుగుపర్చడమే లక్ష్యమని పేర్కొన్న ముఖ్యమంత్రి.*ఏపీ ప్రభుత్వంతో కలిసి పనిచేసేందుకు డాక్టర్ నోరి దత్తాత్రేయుడు అంగీకారం.ముఖ్యమంత్రి సూచన మేరకు కేన్సర్ చికిత్సలో అధునాతన వైద్య విధానాలను, శస్త్రచికిత్స పద్దతులను అందించడంలో ఆంధ్రప్రదేశ్‌లో వున్న వైద్యులకు తగిన నైపుణ్య శిక్షణ అందించడానికి డాక్టర్ నోరి దత్తాత్రేయుడు సంసిద్ధత.తన దగ్గర శిక్షణ పొందిన వైద్యుల ద్వారా రాష్ట్రంలోని మారుమూల ప్రాంతాలకు అంతర్జాతీయ స్థాయి ప్రమాణాలతో కూడిన అత్యాధునిక కేన్సర్ చికిత్సా విధానాలను తీసుకెళ్లవచ్చునని అభిప్రాయపడిన నోరి దత్తాత్రేయుడు.
ఐక్యరాజ్యసమితిలో భారత శాశ్వత ప్రతినిధి, రాయబారి సయ్యద్ అక్బరుద్దీన్‌తో ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు మర్యాదపూర్వక భేటీ.
ముఖ్యమంత్రి బృందంలో మంత్రులు యనమల రామకృష్ణుడు, సోమిరెడ్డి చంద్రమోహనరెడ్డి, ముఖ్యమంత్రి ప్రత్యేక ప్రధాన కార్యదర్శి సతీశ్ చంద్ర, ముఖ్య కార్యదర్శి సాయి ప్రసాద్, ఈడీబీ సీఈవో జాస్తి కృష్ణకిశోర్, సమాచార శాఖ కమిషనర్ వెంకటేశ్వర్.
ముఖ్యమంత్రితో యూఎన్ భారత్ శాశ్వత ప్రతినిధి భేటీ
ప్రకృతి వ్యవసాయం దిశగా రైతులను ప్రోత్సహిస్తున్న ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఆలోచన విధానానికి ఐక్యరాజ్యసమితిలో భారతదేశ శాశ్వత ప్రతినిధి సయ్యద్ అక్బరుద్దీన్ ముగ్ధులయ్యారు. ముఖ్యమంత్రితో ఆయన మధ్యాహ్న విందు సమావేశంలో పాల్గొన్నారు. ఆంధ్రప్రదేశ్‌లో జీరో ఆధారిత ప్రకృతి వ్యవసాయం ప్రోత్సహించడానికి తీసుకుంటున్న చర్యలను ఈ సందర్బంగా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఆయనకు వివరించారు. 60 లక్షల మంది రైతులను కనీసం 80 లక్షల హెక్టార్లలో ప్రకృతి వ్యవసాయం చేసేలా చర్యలు చేపట్టినట్టు సీఎం తెలిపారు. ముఖ్యమంత్రి ఆలోచనలు, చురుకైన నాయకత్వం ఏపీని ఆదర్శ, స్ఫూర్తిమంతమైన రాష్ట్రంగా ముందుకు తీసుకెళ్తాయని అక్బరుద్దీన్ ప్రశంసించారు. ఇరువురూ కలిసి నూతన వ్యవసాయ విధానాలు, రైతులకు రెట్టింపు ఆదాయాన్ని తీసుకొచ్చే మార్గాల గురించి కాసేపు చర్చించారు.