న్యూఢిల్లీ: ప్రధాన మంత్రి నరేంద్ర మోదీతో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైయస్ జగన్‌మోహన్ రెడ్డి సమావేశం అయ్యారు. రాష్ట్ర అభివృద్ధి అజెండాగా ఈ భేటీ జరిగింది. రాష్ట్రానికి కేంద్రం అందించాల్సిన సహాయం, చెల్లించాల్సిన బకాయిలు, రాష్ట్ర విభజన హామీలు, తదితర 17 అంశాలపై ప్రధాన మంత్రికి ముఖ్యమంత్రి నివేదించిన్నట్టు అధికార వర్గాలు తెలిపాయి.