శ్రీశైల దేవస్థానం: కార్తీక మాసోత్సవాలను పురస్కరించుకుని భక్తుల సౌకర్యార్థం వివిధ ఏర్పాట్లు చేస్తున్నారు.ఈ సందర్భంగా ఈ రోజు 18 న కార్యనిర్వహణాధికారి దర్శన క్యూలైన్లను పరిశీలించారు.
కార్యనిర్వహణాధికారి మాట్లాడుతూ సెలవురోజులు, సోమవారం, ఏకాదశి మొదలైన పర్వదినాలలో భక్తులు అధికసంఖ్యలో వస్తారన్నారు. ఇంకా రాబోవు, ఆది,సోమవారాలలో కార్తికమాసోత్సవాల సందర్భంగా అధికసంఖ్యలో భక్తులు క్షేత్రానికి వస్తారని, భక్తుల రద్దీని దృష్టిలో అవసరమైన ముందస్తు చర్యలు చేపట్టాలన్నారు.ముఖ్యంగా కోవిడ్ నిబంధనల పట్ల ప్రత్యేకశ్రద్ధ చూపాలన్నారు.దర్శన ప్రవేశంద్వారం వద్ద మరియు ఆర్జిత సేవల ప్రవేశద్వారం వద్ద థర్మల్ గన్ ద్వారా శరీర ఉష్ణోగ్రతలను తప్పనిసరిగా పరీక్షించాలన్నారు.దర్శనాలకు విచ్చేసే భక్తులను, ఆర్జిత సేవాకర్తలను ఆలయములోనికి అనుమతించేటప్పుపుడు కోవిడ్ నివారణ నిబంధనలను తప్పనిసరిగా అమలు చేయాలని సూచించారు.ఈ విషయమై ఆలయ ప్రసారవ్యవస్థ ద్వారా (మైక్ ద్వారా) నిరంతరం సూచనలు చేస్తూ, భక్తులకు అవగాహనను పెంపొందించాలని శ్రీశైలప్రభ విభాగాన్ని ఆదేశించారు.భక్తులు భౌతికదూరాన్ని పాటించడంలో అవగాహన కల్పించేందుకు క్యూలైన్లలో ప్రతి 25 – 30 అడుగులకు భద్రతా సిబ్బందిని ఏర్పాటు చేయాలని ముఖ్య భద్రతా అధికారిని ఆదేశించారు.అదేవిధంగా ఆర్జిత సేవలను నిర్వహించేటప్పుడు కూడా సేవాకర్తలు తప్పనిసరిగా భౌతికదూరం పాటించే విధంగా సంబంధిత సిబ్బంది తగు జాగ్రత్తలు తీసుకోవాలన్నారు. భక్తులు తప్పనిసరిగా ముఖానికి మాస్కు ధరించడం, ఎప్పటికప్పుడు చేతులు శుభ్రపరుచుకోవడం, భౌతికదూరాన్ని పాటించడంలాంటి నియమాలను విధిగా ఆచరించేలాగా చర్యలు చేపట్టాలన్నారు.అన్ని క్యూలైన్లను ప్రతి రెండుగంటలకోసారి విధిగా క్రిమి సంహారకాలతో పిచికారి చేయించాలన్నారు.