*Mouli,Machilipatnam*
కృష్ణాజిల్లా మచిలీపట్నం: ప్రజాసమస్యలను పరిష్కరించడానికి అనివార్యమైతే తాను రాజకీయాల్లోకి వస్తానని తేల్చి చెప్పిన జేడీ లక్ష్మీనారాయణ. గురువారం ముఖాముఖి కార్యక్రమంలో పాల్గొన్న లక్ష్మీనారాయణకు ముందుగా అడ్వకేట్ శెట్టి బాలాజీ పుష్పగుచ్చం అందించారు. ముఖాముఖి కార్యక్రమానికి వేదిక అయిన కళ్యాణ వేదికకు చేరుకున్న జేడీ లక్ష్మీనారాయణ విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ పీపుల్స్ మేనిఫెస్టో రూపొందిస్తున్నామని తెలిపారు .ప్రజాసమస్యలను పరిష్కరించడానికి రాజకీయాల్లోకి రావడం అనివార్యమైతే వస్తానని జేడీ లక్ష్మీనారాయణ చెప్పారు . సమస్యల పట్ల అవగాహన లేని నాయకుడు నిరుపయోగం, అందుకనే 13 జిల్లాల సమస్యలను తెలుసుకుంటున్నానన్నారు .