శ్రీశైల దేవస్థానం: అధికారులు సిబ్బంది సమన్వయం,భక్తుల సహకారం తో శ్రీశైల మహాశివరాత్రి బ్రహ్మోత్సవాలు దిగ్విజయం అయ్యాయి. ఈ ఓ కెఎస్ .రామరావు నిత్య ప్రత్యక్ష పర్యవేక్షణలో కార్యక్రమాలు అనుకున్నట్లుగా విజయవంతం అయ్యాయి. వివిధ శాఖలు ముఖ్యంగా వైద్య ,విద్యుత్తు, నీటిసరఫరా ,పారిశుధ్య, ప్రసాద వితరణ . శ్రీశైల ప్రభ , పోలీస్ తదితర విభాగాలు సమర్థవంతంగా పనిచేశాయి. అర్చక స్వాములు , వేద మూర్తులు ఆధ్యాత్మిక వాతావరణం పెంచారు. సాంస్కృతిక కార్యక్రమాల సమన్వయంలో పీఆర్ ఓ ఇతర అధికార ,సిబ్బంది ఘనంగా పనిచేసారు. మీడియా సమన్వయ సిబ్బంది చక్కని సహకారం అందించారు. మహాశివరాత్రి బ్రహ్మోత్సవాలు మహాశివరాత్రిని పురస్కరించుకుని మార్చి 4తేదీ నుండి ఈ రోజు (14.03.2021)తో ఘనంగా ముగిసాయి. ఈ ఉత్సవాలలో భాగంగా ఈ రోజు ఉదయం శ్రీ స్వామి అమ్మవార్లకు విశేషపూజలను నిర్వహించారు.
అశ్వవాహన సేవ:
ఈ బ్రహ్మోత్సవాలలో భాగంగా ఈ రోజు (14.03.2021) సాయంకాలం శ్రీ స్వామి అమ్మవార్లకు అశ్వవాహనసేవ ఆకర్షణగా జరిపారు.ఈ సేవలో శ్రీ స్వామి అమ్మవారి ఉత్సవమూర్తులను అశ్వవాహనంపై వేంచేబు చేయించి ప్రత్యేక పూజాదికాలు చేసారు. తరువాత ఆలయ ప్రాంగణంలో ప్రాకారోత్సవం నిర్వహించారు.
పుష్పోత్సవం – శయనోత్సవం:
ఈ బ్రహ్మోత్సవాలలో భాగంగా ఈ రోజు సాయంకాలం శ్రీ స్వామి అమ్మవార్లకు పుష్పోత్సవం జరిపారు. ఈ పుష్పోత్సవంలో శ్రీ స్వామి అమ్మవార్లకు ఎర్రబంతి పసుపుబంతి, పసుపు చేమంతి, తెలుపు చేమంతి, నీలం చేమంతి నందివర్థనం, గరుడవర్థనం, మందారం, ఎర్ర ఆస్టర్, నీలం ఆస్టర్, కాగడాలు, మల్లెలు, మొదలుగా గల 21 రకాల పుష్పాలతో విశేషంగా అర్చించారు. తరువాత శ్రీస్వామి అమ్మవార్లకు ఏకాంత సేవను నిర్వహించి శయనోత్సవం ఏర్పాటు చేసారు.